Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతదేశంలో అగ్రగామి ఎడ్టెక్ కంపెనీ హీరో వైర్డ్ ఇప్పుడు జాతీయ కౌశల్యాభివృద్ధి కార్పొరేషన్ (NSDC)తో భాగస్వామ్యాన్ని కలిగి ఉండగా, ఇంటర్న్‌షిప్‌లు, వ్యాపార ప్రాజెక్టులు, ఆర్థిక మద్ధతును వృత్తినిపుణులు ఉన్నత విద్య ఆకాంక్షులకు అందిస్తోంది. ఈ భాగస్వామ్యం వృద్ధిలోకి వస్తున్న, సంబంధిత సాంకేతికతలైన డ్రోన్ అలవర్చడం, గేమ్ డిజైనింగ్ తదితరాలను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది. సాంకేతిక ఆవిష్కారాత్మక భాగస్వామిగా ఎన్ఎస్డిసికు హీరో వైర్డ్ లెర్నర్లకు ప్రమాణీకరణకు డిజిటల్ ప్లాట్‌ఫారాన్ని సృష్టించడం ద్వారా మద్ధతు ఇవ్వనుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్ఎస్డిసి భవిష్యత్తుకు-సిద్ధంగా ఉండే వర్కుఫోర్సును అన్ని వలయాల్లో మెరుగైన కౌశల్య శిక్షణ ద్వారా సృష్టించేందుకూ మద్ధతు ఇవ్వనుంది. ఈ భాగస్వామ్యం హీరో వైర్డ్కు కౌశల్య రంగంలో మార్పు తీసుకురావాలన్న ఎన్ఎస్డిసి లక్ష్యాన్ని నెరవేర్చడంలో సకారాత్మక పాత్రను పోషించేందుకు సిద్ధమైంది.
ఎన్ఎస్డిసి కౌశల్య శిక్షణ కార్యక్రమాలు కౌశల్యాన్ని వృద్ధి చేసే, పరిశ్రమల్లో క్రియాశీలకంగా భాగమయ్యే అంతర్జాతీయ కొలమానాలకు సరిదూగేలా చేసే, కొలమానాలు, పాఠ్యాంశాలు, నాణ్యత భరోసాలకు అవసరమయ్యే ఫ్రేమ్వర్కు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. సంస్థ విస్తృత నెట్వర్కను ఉపయోగించుకుని ఈ భాగస్వామ్యం సంస్థలు, వ్యాపారాలకు తన విస్తృతమైన కోర్సులు, లెర్నింగ్ కార్యక్రమాలను హీరో వైర్డ్కు చెందిన ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫారం ద్వారా అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా అందుబాటులో ఉండే అన్ని కార్యక్రమాలు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ (NSQF)కు అనుగుణంగా ఉంటుంది. ఎన్ఎస్డిసి కూడా సహ-ప్రమాణీకరణ చేస్తుంది.
ఎన్ఎస్డిసి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేద్ మణి తివారి మాట్లాడుతూ, ‘‘హీరో వైర్డ్ భాగస్వామ్యంలో భారతదేశంలోని యువతకు కొత్త తరం కౌశల్యాలతో అప్‌స్కిల్ చేయడంపై దృష్టి సారంచాము. ఆర్థిక రంగం తీవ్రంగా మారిపోతుంది. ఎన్ఎస్డిసి దేశంలోని యువతను ఈ మార్పును అలవర్చుకునేందుకు సిద్ధం చేసేందుకు కట్టుబడి ఉంది. కౌశల్యాభివృద్ధికి ప్రయివేటు వాళ్లు తీసుకునే కార్యక్రమాలను ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి మద్ధతు ఇవ్వడం వృద్ధి చేయడాన్ని మేము లక్ష్యంగా నిర్దేశించుకున్నాము. ఈ భాగస్వామ్యం ద్వారా, మెరుగైన సాంకేతికతలను విస్తరించే అటువంటి ఆవిష్కారాత్మక కార్యక్రమాలను పరిచయం చేయడం ద్వారా మేము యువతలో పోటీని, భవిష్యత్తుకు సన్నాహం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము’’ అని వివరించారు.
హీరో వైర్డ్ సీఈఓ, వ్యవస్థాపకుడు అక్షయ్ ముంజాల్ మాట్లాడుతూ, ‘‘హీరో వైర్డ్, ఎన్ఎస్డిసి దేశంలోని విద్యా రంగంలో సరికొత్త పరికల్పన, కౌశల్యాన్ని అందించే లక్ష్యాన్ని పంచుకున్నాయి. హీరో వైర్డ్లో లెర్నింగ్ విధానం ఇన్స్స్ట్రక్టర్-ప్రేరిత అత్యాధునిక లెర్నింగ్‌ను కలిగి ఉన్నాయి. మేము పరిశ్రమలో విద్యావిధానానికి పక్కనే చాలా చేరువ నుంచి ఎంపిక చేసిన కార్యక్రమాలను అందిస్తున్నాము, అంటే, విద్యా సంబంధిత అంశాన్ని సృష్టించడం, దాన్ని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అందించడం, ఈ అన్నింటినీ ఎన్ఎస్డిసి భాగస్వామ్యంలో నిర్వహిస్తున్నాము. మేము ఇప్పటికే కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఫిన్‌టెక్, గేమ్ డిజైనింగ్ వంటి పలు ప్రముఖ సాంకేతికతల్లో కార్యక్రమాలను అందిస్తున్నాము. ఈ భాగస్వామ్యం యువతకు ఉద్యోగ అవకాశాలను వృద్ధి చేయడంలో, వారి వృత్తి నైపుణ్య అభివృద్ధిలో పలు మార్గాలను చూపించడంలో మద్ధతు ఇస్తుంది’’ అని వివరించారు.
ఈ కార్యక్రమం సమగ్ర, సంపూర్ణ లెర్నింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండగా, నేర్చుకునే వారికి కేవలం పరికరాలు, సాంకేతికత మాత్రమే కాకుండా సమగ్రంగా అర్థం చేసుకోవడాన్ని, పరిశ్రమల్లోని ఆయా యామాలు సమస్యల నివారణకు అవసరమైన సాఫ్ట్ స్కిల్స్‌తో తయారుగా ఉంచుతుంది. హీరో వైర్డ్లో పార్ట్ టైమ్ కార్యక్రమాలకు రిజిస్ట్రరు చేసుకున్న విద్యార్థులకు పరిశ్రమకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పని చేసే అవకాశాన్ని పొందుతారు, పూర్తి సమయం పని చేసేందుకు పేర్లు నమోదు చేసుకున్న వారికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తాయి, అందులో వారు తమ రంగంలో నిజ జీవిత సమస్యలను పరిష్కరించడాన్ని నేర్చుకుంటారు.
హీరో వైర్డ్ శిక్షణ పొందేందుకు అశక్తులుగా ఉన్న వారికి మద్ధతు ఇవ్వడం ద్వారా విద్యావకాశాలను తిరిగి కల్పించేందుకు కట్టుబడి ఉంది. కంపెనీ 2021-2022 ఆర్థిక సంవత్సరంలో మొదటి 300 మంది అభ్యర్థులకు (6-11 నెలలు) రుణ హామీ ఇస్తుంది. ఎన్ఎస్డిసి నియామక భాగస్వామిగానూ ఉండడంతో, నేర్చుకునే వారికి వారి నియామక అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నుంచి మార్గదర్శనం కూడా ప్రత్యేకంగా లభిస్తుంది. ఇది ఎన్ఎస్డిసికి హీరో వైర్డ్ కార్యక్రమంలో భాగంగా శ్రేష్ఠమైన ప్రతిభను అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అదనంగా హీరో వైర్డ్ ప్రత్యేకమైన లెర్నింగ్ పరిష్కరణలను సృష్టిస్తుండగా, అది సరిసాటిలేని లెర్నర్ మరియు పార్ట్నర్ ఆన్‌బోర్డింగ్, ప్రక్రియను అందించడం ద్వారా సమగ్ర కార్యక్రమాన్ని అందించడం సాధ్యం చేస్తుంది. ఇది విజయవంతమైన లెర్నింగ్ ఫలితాంశాలను, చివరిగా యువ మనస్సులను భవిష్యత్తు ఉద్యోగాలకు సిద్ధం చేస్తుంది. ఈ కౌశల్యాన్ని నిరీక్షించే వారు, వృత్తి నిపుణులు ఆన్లైన్ కోర్సులకు https://herovired.com/ ఇక్కడ ప్రవేశం పొందడం ద్వారా వారు కొత్త తరపు వ్యాపారాలకు తమను తాము సిద్ధం చేసుకోవచ్చు.