Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత శక్తియుతమైన మిని-ట్రక్ మారుతి సుజుకి సూపర్ క్యారీని మార్కెట్లో విడుదల చేసిన కేవలం 5 ఏండ్లలోనే 100,000 క్రమబద్ధమైన యూనిట్ విక్రయ రికార్డుతో ఇటీవల కొత్త మైలురాయిని నెలకొల్పింది. దీనిలోని 4-సిలిండర్ ఇంజిన్ అందిస్తున్న భారతదేశంలోని ఏకైక మిని-ట్రక్ సూపర్ క్యారీ దక్షతతో సరుకుల రవాణా వాహనాల అవసరం ఉన్న వాణిజ్య వినియోగదారుల వైవిధ్యమయ అవసరాలను పరిష్కరిస్తుంది. పెట్రోలు, సిఎన్జి ఎంపికలు రెండింటిలోనూ అందుబాటులో ఉన్న మారుతి సుజుకి సూపర్ క్యారీని భారతదేశానికి ప్రత్యేకంగా మిని-ట్రక్ వినియోగదారుల ప్రత్యేక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేశారు.
మారుతి సుజుకి భారతదేశంలో సూపర్ క్యారీని పరిచయం చేయడం ద్వారా 2016లో వాణిజ్య వలయానికి పాదార్పణ చేసింది. చాలా తక్కువ సమయంలోనే సూపర్ క్యారీ తన ఈ వర్గంలో అత్యుత్తమ శక్తి, అద్భుత మైలేజ్, సులభ నిర్వహణ, వృద్ధి చేసిన స్టోరేజ్ సామర్థంతో అపారమైన ప్రశంసలు అందుకోగా, అది వారి లాభాన్ని వృద్ధి చేసుకునేందుకూ మద్ధతుగా నిలిచింది. ఈ మైలురాయి గురించి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీనియరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, ‘‘అత్యంత తక్కువ సమయంలోనే సూపర్ క్యారీ అపారమైన మార్కెట్ నుంచి స్వాగతాన్ని అందుకుంది. వినియోగదారుల నుంచి చక్కని ప్రశంసలు అందుకుంది. సూపర్ క్యారీ ద్వారా మేము వినియోగదారులకు వారి ఎక్కువ దక్షత, లాభదాయకం చేసే విధంగా వారి సరుకులను తరలించే ఉత్పత్తుల విస్తృత శ్రేణికి పంపిణీ చేస్తున్నాము. సూపర్ క్యారీ ఎస్-సిఎన్జి వేరియంట్ వ్యాపారాలకు అద్భుతమైన మైలేజ్ 21.55 కి.మీ/కేజి అందించడం ద్వారా వారి లాభదాయకతను వృద్ధి చేస్తుంది. సూపర్ క్యారీ మిని-ట్రక్కులు శక్తియుతమైన, అనుకూలకరమైన డ్రైవింగ్, సులభమైన నిర్వహణ, యజమానులకు లాభదాయకం అని రుజువు చేసింది. అదే కారణానికి సూపర్ క్యారీ యజమానులు దాని నాణ్యతను ధృవీకరిస్తారు. మాపై వారు విశ్వాసాన్ని ఉంచినందుకు, సూపర్ క్యారీని తేలికపాటి వాణిజ్య వాహన వలయంలో ద్వితీయ అత్యుత్తమ విక్రయాలను కలిగిన మిని-ట్రక్కుగా నిలిపినందుకు మా వినియోగదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము’’ అని పేర్కొన్నారు.
మారుతి సుజుకి సూపర్ క్యారీ దేశంలోని మొదటి 4-సిలిండర్ కలిగిన మిని-ట్రక్ కాగా 54కెడబ్ల్యూ@6000 ఆర్ఎంపి శక్తి, 98ఎన్ఎం @ 3000 ఆర్పిఎం టార్క్ అందిస్తుండగా, మృదువైన పికప్ అందిస్తుంది. ఇది రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, సీట్ బెల్ట్ రిమైండర్, లాక్ చేయగలిగిన గ్లోవ్ బాక్స్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, ఉత్తమంగా డ్రైవబుల్కు తేలికపాటి స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. సూపర్ క్యారీ అనేది దేశంలో డ్యూయల్ ఫ్యూయల్ ఎస్-సిఎన్జి వేరియంట్ 5 లీటర్ పెట్రోల్ ట్యాంక్ కలిగిన ఏకైన మిని-ట్రక్‌గా ఉంది. దేశంలోని విశ్వసనీయమైన తేలికపాటి వాణిజ్య వాహనం సూపర్ క్యారీ 2183 మి.మి. పొడవు 1488 మి.మి. వెడల్పు డెక్ ప్రదేశాన్ని ఇవ్వడంతో పాటు 740 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సూపర్ క్యారీ 175 మి.మి. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండగా, సస్పెన్షన్ కర్తవ్యాలను విశ్వసనీయమైన మ్యాక్ ఫెర్సన్ స్ట్రట్‌లు ముందువైపు, వెనుక రిజిడ్ యాక్సల్ లీఫ్ స్ర్పింగ్స్తో అందిస్తుంది.
సూపర్ క్యారీని మారుతి సుజుకి భారతదేశంలోని 237 నగరాల్లో విస్తరించిన ప్రత్యేకమైన 335 వాణిజ్య షోరూమ్‌ల ద్వారా విక్రయిస్తోంది. భాగస్వామ్యం, విశ్వాసార్హత, దక్షత, పారదర్శకత, జాణతనపు విలువలను ఒంటబట్టించుకుని రూపుదిద్దుకున్న వాణిజ్య ఛానెల్ భారతదేశం వ్యాప్తంగా 3800+ మారుతి సుజుకి సర్వీసు కేంద్రాల విస్తృత సేవా నెట్వర్కు మద్ధతు కలిగి ఉంది. సూపర్ క్యారీతో కమర్సియల్ ఛానెల్ ఎకో కార్గో, మారుతి సుజుకి కార్ల టూర్ శ్రేణి (టూర్ హెచ్1, టూర్ ఎస్, టూర్ ఎం మరియు టూర్ వి)ను కూడా విక్రయిస్తోంది.