Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తన మూడవ ల్యామినేట్ విభాగాన్ని ప్రారంభించింది
- రానున్న 2-3 ఏళ్లలో గ్రీన్‌ఫీల్డ్ ఉత్పాదన పథకాల్లో రూ.950 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్ 3 ల్యామినేట్ ఉత్పాదకుల్లో ఒకరైన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేడు కంపెనీని వేగంగా విస్తరించేందుకు ప్రముఖ పథకాలను ప్రకటించింది. కంపెనీ రానున్న 2-3 ఏళ్లలో రూ.950 కోట్లను పెట్టుబడి పెట్టే లక్ష్యంతో, మూడవ ల్యామినేట్ కేంద్రాన్ని నెలకొల్పుతూ, ఫ్లైవుడ్, పార్టికల్ బోర్డ్ వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది.
అలంకారిక సర్ఫేసింగ్ పరిష్కరణల్లో అగ్రగామిగా ఉన్న కంపెనీ, అలంకారిక ల్యామినేట్ల నుంచి, కాంప్యాక్ట్ ల్యామినేట్స్, ఔట్‌డోర్, ఇంటీరియర్ క్లాడ్స్, అలంకారిక వినీర్లు, ఇంజినీయర్డ్ ఉడెన్ ఫ్లోర్లు, వసతి అలాగే వాణిజ్య స్థలాలకు తలుపులు తయారు చేస్తోంది. వుడ్ ప్యానెల్ వలయంలో డిమాండ్ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కంపెనీ తదుపరి అడుగులు ముందుకు వేసి, తన పోర్ట్‌ఫోలియోను తన వ్యాపారానికి సమీపంలో ఉన్న విభాగాలైన ఫ్లైవుడ్, పార్టికల్ బోర్డుల తయారీ విభాగానికి అడుగుపెట్టడం ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఈ విస్తరణ గ్రీన్లామ్ను అలంకారిక సర్ఫేసింగ్ కంపెనీ నుంచి అగ్రగామి ఏకీకృత వుడ్ ప్యానెల్ కంపెనీగా మార్చనుంది.
ఉత్పాదనలో శ్రేష్ఠతకు కట్టుబడిన, ప్రపంచ వ్యాప్తంగా సర్ఫేస్ పరిష్కరణల్లో ముందంజలో ఉన్న ల్యామినేట్, ఫ్లైవుడ్, పార్టికల్ బోర్డు ఆఫర్లతో గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ మార్కెట్ అవకాశాలను వృద్ధి చేస్తుంది. తన ప్రగతికి కొత్త ఆదాయపు ఉత్తేజకాలను చేర్చుతుంది. మూడవ ల్యామినేట్ ప్లాంట్, పార్టికల్ బోర్డులోని పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలోని గ్రీన్‌ల్యామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు 100% అధీన సంస్థ గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌లో భాగంగా నిర్వహించనున్నారు. కంపెనీ అత్యాధునిక సాంకేతికత, సాధన, కొత్త తరానికి చెందిన యంత్రోపకరణాలపై పెట్టుబడి పెడుతుండగా, రూ.600 కోట్ల పెట్టుబడిలో సాలీనా 2,31,000 సీబీఎం సామర్థ్యపు పార్టికల్ బోర్డులను ఉత్పత్తి చేయనుంది. కంపెనీ ఏడాదికి 3.5 మిలియన్ షీట్లు, బోర్డుల సామర్థ్యాన్ని రూ.225 కోట్ల పెట్టుబడితో ప్రారంభించనుంది. ఈ అత్యాధునిక ఏకీకృత సౌకర్యం వ్యాపారంలో మొదటిది కాగా, ల్యామినేట్లకు అనుబంధంగా అలంకరణలు, కాంప్యాక్ట్లు, పోస్ట్ ఫార్మింగ్ ల్యామినేట్ , ప్రీల్యామ్ పార్టికల్ బోర్డులను అందించడం ద్వారా సమగ్రమైన సర్ఫేసింగ్, సబ్‌స్ట్రేట్ పరిష్కరణలను వినియోగదారులకు అందిస్తుంది.
ప్రత్యేకమైన ఫ్లైవుడ్ ఉత్పాదన ఫెసిలిటీ కొత్తగా స్వాధీనపరుచుకున్న తమిళనాడు తిండివనంలోని హెచ్‌జి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిధిలోకి వస్తుండగా, ఇది ప్రతి ఏటా 18.9 మిలియన్ చ.మీటర్ సామర్థ్యంతో రూ.125 కోట్ల పెట్టుబడిని అందుకోనుంది. గ్రీన్‌లామ్ ఫ్లైవుడ్, ల్యామినేట్ల వాణిజ్య కార్యాచరణను 2023 4వ త్రైమాసికంలో, పార్టికల్ బోర్డ్‌ను 2024వ ఏడాది 4వ త్రైమాసికంలో ప్రారంభించే నిరీక్ష ఉంది.
ఈ అభివృద్ధి గురించి గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సురభ్ మిట్టల్ మాట్లాడుతూ, ‘‘పలు సంవత్సరాల నుంచి మేము గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్‌కు భారతదేశం అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో నాయకత్వ స్థానాన్ని రూపొందించడంలో సుదూర ప్రయాణాన్ని చేశాము. ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న మేము సదా అడ్డంకులను అధిగమించేందుకు ప్రేరేపించబడ్డాము. సంచలనాత్మక ప్రగతికి అవకాశాలకు నిరీక్షించాము. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఉత్పాదన పథకాలకు 2-3 ఏళ్లలో రూ.950 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాము. ఫ్లైవుడ్, పార్టికల్ బోర్డు మార్కెట్టుకు మా ప్రవేశం, ల్యామినేట్ సామర్థ్యాన్ని విస్తరించే అన్ని సర్ఫేసింగ్, సబ్‌స్ట్రేట్ అవసరాలకు ఒన్-స్టాప్ కేంద్రంగా చేసే మా నిబద్ధతను పునరుశ్ఛరించింది’’ అని వివరించారు.
దీనితో కంపెనీ తన పాలక మండలి సభలో రూ.5లో ఈక్విటీ షేర్లను తలా రూ.1 చొప్పున ఐదు ఈక్విటీ షేర్లుగా విభజించేందుకు ఆమోదం పలికింది. కంపెనీ మెమరాండం ఆఫ్ అసోసియేషన్‌లో క్లాజ్ Vలో (పెట్టుబడి నిబంధన) పరిణామపు మార్పు అవసరమైతే కంపెనీ వాటాదారులు, ఇతర ఆమోదాలను పొందవలసి ఉంటుంది.