Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బిఎండబ్ల్యు భారత మార్కెట్లోకి ఐఎక్స్ ఎస్యువి విద్యుత్ వాహనాన్ని విడుదల చేసింది. 2.5 గంటల్లో 100 కిలోమీటర్లకు సరిపడేంత చార్జింగ్ అయ్యే ఈ వాహన ప్రారంభ ధరను రూ.1.16 కోట్లుగా నిర్ణయించింది. వచ్చే ఆరు నెలల్లో ఆ కంపెనీ భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్న మూడు ఇవిలో ఇది తొలి ఉత్పాదన అని తెలిపింది. ఈ వాహన డెలివరీలు 2022 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని బిఎండబ్ల్యు గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా తెలిపారు.