Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. 6.40 శాతానికే గృహ రుణాలు జారీ చేస్తున్నట్లు ఆ బ్యాంక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. రిటైల్ బొనాంజా ఫెస్టివల్ ధమాకా ఆఫర్లో భాగంగా డిసెంబర్ 13 నుంచి తగ్గించిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. కారు రుణాలపై వడ్డీ రేట్లను 6.80 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. గతంలో ఈ రేటు 7.05 శాతంగా ఉంది. మార్కెట్లోని పోటీని దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయ వడ్డీ రేట్లను ప్రకటించామని బిఒఎం తెలిపింది. ఖాతాదారుల క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు వర్తిస్తుందని వెల్లడించింది. బంగారం, గృహ, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు తెలిపింది. ఈ ఆఫర్లను ఉపయోగించుకోవడం ద్వారా వినియోగదారులు రుణాలపై పెద్ద మొత్తంలో ఆదా చేసుకోగలరని బిఒఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ తామ్టా ఆశాభావం వ్యక్తం చేశారు