Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా తాజాగా డాష్ ఫార్మాస్యూటికల్ను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఒప్పందం తర్వాత రెగ్యూలేటరీ సంస్థల ఆమోదం లభించాల్సి ఉందని నాట్కో పేర్కొంది. అమెరికా న్యూజెన్సీ కేంద్రంగా ఔషదాలను విక్రయించే డాష్ ఫార్మా 2021 డిసెంబర్‌తో ముగిసిన ఏడాదిలో 15 మిలియన్ డాలర్ల అమ్మకాలు చేసింది. నాట్కో ఈ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా అమెరికాలో ప్రత్యక్షంగా పెద్ద మొత్తంలో వినియోగదారులను పొందనుంది. అయితే డాష్ ఫార్మాను ఎంతకు కొనుగోలు చేసిన విషయాన్ని నాట్కో వెల్లడించలేదు.