Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సుప్రసిద్ధ స్పోర్ట్స్‌వేర్ సంస్ధ, అడిడాస్ ఇండియా తమ మొబైల్ షాపింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. దీనిద్వారా మెరుగైన డిజిటల్ షాపింగ్ అనుభవాలను దేశవ్యాప్తంగా తమ వినియోగదారులకు అందించనుంది. అడిడాస్ యాప్ ద్వారా వినియోగదారులు బ్రాండ్ యొక్క తాజా మరియు అత్యంత సృజనాత్మకమైన స్పోర్ట్స్ ఆఫరింగ్స్, స్నీకర్ డ్రాప్స్, సీజనల్ అప్పెరల్ వంటివి అందించనుంది. వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాలను అందించే రీతిలో డిజైన్ చేశారు. ఇది ఏఐ సాంకేతికత శక్తి తో రావడంతో పాటుగా వారి నూతన, మెరుగైన విష్ లిస్ట్‌తో వినియోగదారుల ప్రాధాన్యతనూ తెలుసుకోగలరు. వీటితో పాటుగా దీనిలో చాట్ అవకాశాలు, ఏఆర్ ట్రై ఆన్స్ ఉంటాయి. ఇది సరళమైన సురక్షితమైన చెకవుట్స్ను ప్రత్యేక ఆఫన్లు, రివార్డు పాయింట్లు, బహుమతులు, ప్రత్యేకమైన కార్యక్రమాలతో అందిస్తుంది. అడిడాస్ సభ్యత్వ కార్యక్రమం క్రియేటర్స్ క్లబ్‌కు నిలయంగా ఈ యాప్ ఉంటుంది. ఇది అత్యుత్తమ అడిడాస్ను అన్‌లాక్ చేస్తుంది. ఈ క్రియేటర్స్ క్లబ్ సభ్యత్వ కార్యక్రమం పలు స్టోర్లు, వెబ్సైట్ వ్యాప్తంగా అనుసంధానించబడటంతో పాటుగా ప్రత్యేకమైన ఉత్పత్తులు, అనుభవాలు పొందే వీలునూ కలిగిస్తుంది. ఈ ఆవిష్కరణ గురించి బ్రాండ్ అడిడాస్ సీనియర్ డైరెక్టర్ శ్రీ సునీల్ గుప్తా మాట్లాడుతూ ‘‘అడిడాస్ యాప్ మరియు క్రియేటర్స్ క్లబ్ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభంతో మా వినియోగదారుల కోసం అసాఽధారణ అవకాశాలను తీసుకురావాలనుకుంటున్నాము. ఇటీవలనే పూర్తిగా పునరుద్ధరించిన సైట్ www.adidas.co.in తో పాటుగా ఇప్పుడు అడిడాస్ యాప్‌తో వినియోగదారుల అనుభవాలను మెరుగుపరిచే అత్యాధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకువచ్చాము’’ అని అన్నారు. అంతేకాకుండా ఈ బ్రాండ్ ఇప్పుడు వినియోగదారుల డిజిటల్ షాపింగ్ అనుభాలను పలు ఆఫర్లు, ప్రయోజనాలు, ఉత్పత్తులతో వృద్ధి చేయాలనుకుంటుంది. క్రియేటర్స్ క్లబ్లో చేరిన సభ్యులకు ప్రత్యేక రాయితీలతో పాటుగా మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అడిడాస్ యాప్ ఆవిష్కరణ సందర్భంగా షాపర్లకు 20% ప్రత్యేక రాయితీ అందిస్తారు. ఈ యాప్‌ను గుగూల్ ప్లే, యాప్ స్టోర్‌పై ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://go.adidas.com/ihha/13b968c2