Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మైక్రో ఫైనాన్స్ రుణాల జారీలో పెరుగుదల నమోదయ్యింది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో 5.16 శాతం పెరిగి రూ.2.43 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే మాసం నాటికి ఈ రుణాలు రూ.2.31 లక్షల కోట్లుగా ఉన్నాయని మైక్రోఫైనాన్స్ ఇన్స్స్టూషన్స్ నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) తెలిపింది. ఈ అసోసియేషన్‌లో 30 సంస్థలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థలు 54.26 లక్షల ఖాతాలకు రూ.19,672 కోట్ల రుణాలు జారీ చేశాయి. 2020-21 ఇదే సెప్టెంబర్ త్రైమాసికంలో 25.99 ఖాతాలకు రూ.8,155 కోట్ల రుణాలు మంజూరు చేశాయి.