Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రయోగాత్మక బోధనా యాప్ ప్రాక్టికల్లీ కొత్తగా పలు దేశాల నుంచి నిధులు సమీకరించినట్లు తెలిపింది. వచ్చే ఏడాది కోసం తలపెట్టిన సిరీస్-బి నిధుల సేకరణలో భాగంగా తాజాగా 5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.38 కోట్లు) వ్యూహాత్మక పెట్టుబడులను ఎన్బి వెంచర్స్ (యుఎఇ), ఎర్ల్స్ఫీల్డ్ (యుకె), ఆల్మో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (యుఎఇ), ఎన్క్యూబేట్ కేపిటల్ సంస్థల నుంచి సమీకరించినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలోనూ యూవర్నెస్ట్ వెంచర్ కేపిటల్, ఎక్స్ఫినిటీ వెంచర్స్, సియానా కేపిటల్స్ నుంచి దాదాపు రూ.68 కోట్ల నిధులు సేకరించింది.