Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టాలు చవి చూశాయి. కరోనా కొత్త రకం ఒమిక్రాన్ వేరియంట్ భయాలు రోజు రోజుకి పేరుగుతుండటంతో బుధవారం సెషన్లో ముఖ్యంగా రియాల్టీ, ఐటి, లోహ, టెలికం, ఎఫ్ఎంసిజి రంగాల సూచీల అమ్మకాల ఒత్తిడితో బిఎస్ఇ సెన్సెక్స్ 329 పాయింట్లు కోల్పోయి 57,788కి పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 17,221 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వరుసగా 3 శాతం, 2 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అంతకంతకూ పడిపోతూ వచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వు ఉద్దీపనల ఉపసంహరణకు సంకేతాలు ఇవ్వడంతో మదుపర్లలో విశ్వాసం సన్నగిల్లింది. మరోవైపు దేశంలో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం సూచీలు పెరగడంతో మదుపర్లు ఆందోళనకు గురైయ్యారు.