Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నాస్కామ్ షౌండేషన్తో భాగస్వామ్యం చేసుకుని సిస్కోకు చెందిన సీఎస్ఆర్ కార్యక్రమం సిస్కో థింగ్క్యూబాటర్ తమ 4వ కోహార్ట్‌లో భాగంగా అత్యున్నత ప్రదర్శన కనబరిచిన పది స్టార్టప్స్‌ను నేడు సత్కరించారు. 2018లో సిస్కో మరియు నాస్కామ్ ఫౌండేషన్లు 18 యూనివర్శిటీలతో భాగస్వామ్యం చేసుకుని విద్యార్థులలో వ్యవస్థాపకత ప్రోత్సహించడం, సిస్కో థింగ్క్యూబాటర్ కార్యక్రమం క్రింద నైపుణ్యం వృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. సిస్కో థింగ్క్యూబాటర్ అనేది వర్ట్యువల్ మేకర్ స్పేస్ ప్రోగ్రామ్. దీనిని ఈ భాగస్వామ్య యూనివర్శిటీలలో నిర్వహిస్తున్నారు. అక్కడ విద్యార్థులు డిజిటల్ సాంకేతికతలు అభ్యసిస్తున్నారు. అలాగే తమ ఆలోచనలను వర్కింగ్ ప్రోటోటైప్స్‌గా మార్చుకుంటున్నారు. ఈ సత్కార కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ సెక్రటరీ రాజేష్ అగర్వాల్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏయిమ్) మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ ; సిస్కో నుంచి సిస్కో సిస్టమ్స్ ఇండియా , ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నాయర్; సిస్కో ఆర్కిటెక్చర్, ఏపీజెసీ వైస్ ప్రెసిడెంట్ విష్ అయ్యర్ ; సిస్కో సిస్టమ్స్ ఇండియా అండ్ సార్క్ చీఫ్ పాలసీ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్ పాల్గొన్నారు. అగ్రస్థానంలో నిలిచిన టాప్ 10 స్టార్టప్స్‌లో సపియెంచురీ ; ఎనేబల్– యువర్ గ్రీన్ విండో, సుబిల్ట్, సోషియో ట్రీ, రిమోట్ హెల్త్ మానిటర్ తదితర సంస్థలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ఆవిష్కరణలకు ఇండియా ప్రసిద్ధి కావడమేకాదు ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్ కేంద్రాలలో ఒకటిగా వెలుగొందుతుంది. దీనిని మరింత వేగవంతం చేసే క్రమంలో యూనివర్శిటీ విద్యార్థుల మరింత వృద్ధిచెందేందుకు తగిన వేదిక నిర్మించాల్సి ఉంది. అత్యాధునిక ఇన్క్యుబేషన్ కేంద్రాలు, పరిశ్రమ నిపుణులతో మెంటారింగ్, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. సిస్కో ఇప్పుడు ఈ అంశాలతో థింగ్క్యూబాటర్ కార్యక్రమం తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు హరిష్ కృష్ణన్ మాట్లాడుతూ ‘‘మా థింగ్క్యూబాటర్ వేదిక అత్యంత ముఖ్యమైన విలువలు, వ్యవస్థాపకత, మెంటారింగ్, డిజిటల్ నైపుణ్యాలను పొందే అవకాశం అందిస్తుంది’’ అని అన్నారు. నాస్కామ్ ఫౌండేషన్ సీఈవో నిధి భాసిన్ మాట్లాడుతూ ‘‘ఈ కార్యక్రమం ద్వారా ఛేంజ్ మేకర్స్‌ను సృష్టించడం వీలవుతుంది’’ అని అన్నారు.