Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : BMW మోటర్రాడ్ ‘టీమ్ ఇండియా’కు ఫైనలిస్టులను ప్రకటించగా, వారు BMW మోటర్రాడ్ ఇంటర్నేషనల్ GS ట్రోఫీ 2022 లో పాల్గొంటారని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మల్టి-సిటీ క్వాలిఫైయర్ల నుంచి ఫైనలిస్టులను ఎంపిక చేశారు అల్వేనియా ఇంటర్నేషనల్ GS ట్రోఫీలో భారతదేశాన్ని సగర్వంగా ప్రాతినిధ్యం వహించనున్నారు.
కోల్‌కత్తాకు చెందిన రమీజ్ ముల్లిక్, బెంగళూరుకు చెందిన చౌడేగౌడ, పుణెకు చెందిన అబిద్ జవాన్‌మర్ది ముగ్గురు విజేతలు.
మొట్టమొదటిసారిగా మహిళా GS రైడర్ టీమ్ కూడా ప్రాంతీయ క్వాలిఫైయర్ రౌండ్లలో పోటీ చేయనున్నారు మరియు BMW మోటార్రాడ్ ఇంటర్నేషనల్ GS ట్రోఫీ 2022 ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశాన్ని కూడా పొందుతారు.
BMW గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావాహ్ మాట్లాడుతూ, ‘‘GS ట్రోఫీ పోటీతో కూడిన కౌశల్యాల సవాలు, జట్టుగా పని చేయడం మరియు మహోన్నత రైడింగ్‌కు మొద్దు గుర్తుగా ఉంటుంది. ఈ విజేతలు అందరికీ అసాధరణమైన సహనం, రైడింగ్ కౌశల్యాలు మరియు జట్టు స్ఫూర్తి ప్రదర్శిస్తున్నందుకు అభినందిస్తున్నాము. మాతృభూమికి ఇంటర్నేషనల్ GS ట్రోఫీ తీసుకు వచ్చేందుకు ఈ గుణాలు సమృద్ధి కోసం అత్యవసరం. ప్రతి సభ్యుడూ జట్టు సామర్థ్యానికి ఆఫర్ ఇచ్చేందుకు మరియు శక్తి నింపేందుకు తమ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. అయితే పోటీ కన్నా ఎక్కువగా మరొకటి ఏమీ లేదు, అలాగే అవిస్మరణీయ అనుభవంగా ఉంటుంది. పూర్తి BMW GS సముదాయం మరియు భారతదేశంలో రైడింగ్ ఔత్సాహికులు మీ ప్రగతిని చేరువగా అనుసరిస్తుంటారు. మేము ‘టీమ్ ఇండియా’కు శుభాన్ని కోరుతున్నాము. ముందడుగు వేయండి మరియు ‘మేక్ లైఫ్ ఏ రైడ్’!’’ అని పేర్కొన్నారు.
BMW GS యజమానులు రోమాంఛనంగా ఉండే ఇండియన్ నేషనల్ క్వాలిఫైయర్‌లో మూడో ఎడిషన్‌లో రైడర్లు వివిధ రకాల తీవ్రమైన దశల్లో తలపడగా, అందులో హార్డ్-కోర్ అడ్వెంచర్ రైడింగ్ మరియు టీమ్ వర్క్ సవాళ్లు ఉన్నాయి. రైడింగ్ సామర్థ్యం, టెక్నిక్, నేవిగేషన్ మరియు మెకానికల్ కౌశల్యాలు ప్రదర్శనకు ప్రత్యేక పరీక్షలుగా ఉన్నాయి.
టీమ్ ఇండియా దేశాన్ని అల్బేనియాలో జరిగే BMW మోటార్రాడ్ ఇంటర్నేషనల్ GS ట్రోఫీ 2022 లో సగర్వంగా ప్రాతినిధ్యం వహించనుంది. జట్టు తదుపరి సాహసానికి BMW మోటార్రాడ్తో పూర్తిగా సిద్ధం కాగా, అల్బేనియాకు ప్రయాణించిన మరియు కార్యక్రమం సమయంలో ప్రతి రైడర్‌కూ సరికొత్తగా పర్సనలైజ్ చేసిన BMW GS మోటార్ సైకిల్‌ను ఇచ్చారు. టీమ్ ఇండియా బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ల్యాటిన్ అమెరికా, మెక్సికో, నెదర్ల్యాండ్, రష్యా, దక్షిణ ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తదితర జట్టకు వ్యతిరేకంగా పోటీ పడనుంది.
ఇండియన్ నేషనల్ క్వాలిఫైయర్ ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది మరియు ఇంటర్నేషనల్ GS ట్రోఫీ సవాళ్లను పునరావర్తిస్తుంది. మూడో ఎడిషన్‌కు మల్టి-సిటీ క్వాలిఫైయర్లు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు మరియు భువనేశ్వర్లలో జరిగింది. ఇందులో 250 కు పైగా ఎక్కువ మంది రైడర్లు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పాల్గొని తమ సామర్థ్యాన్న ప్రదర్శించారు.
ఇంటర్నేషనల్ GS ట్రోఫీ గురించి:
BMW మోటార్రాడ్ ఇంటర్నేషనల్ GS ట్రోఫీ ఒక రేస్ కాదు, అయితే జట్టు పోటీగా GS రైడింగ్ ఇంటర్నేషనల్‌లో పాల్గొనే పోటీదారులు పరస్పరం శ్రేణి సవాళ్లను ఎదుర్కొంటారు మరియు అందరూ రైడింగ్‌లో పాల్గొనరు.
‘ఎక్స్ప్లోర్ ది అన్ఎక్స్పెక్టెడ్’ BMW మోటార్రాడ్ ఇంటర్నేషనల్ GS ట్రోఫీ ఎనిమిదవ ఎడిషన్ ధ్యేయం కాగా అది 2022 వేసవిలో జరుగనుంది. అల్బేనియా ఆఫ్-రోడ్ టూరింగ్‌కు అత్యుత్తమ కేంద్రంగా పరిగణించబడింది మరియు అసాధారణ మొక్కలు అలాగే ప్రాణి సంపద అలాగే సంస్కృతితో ఉన్నతంగా ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ ఎండురో రైడర్లు ఈ ప్రశాంతమైన అజ్ఞాత సౌందర్యాన్ని వారి GS బైక్స్‌లో ఆవిష్కరించవచ్చు మరియు చేరువ నుంచి #SpiritOfGS అనుభవాన్ని పొందవచ్చు.
పోటీదారులు రాత్రుళ్లు బైవాక్లో క్యాంప్ చేస్తారు, ఈ కార్యక్రమం సోదరతత్వం, సోదరితత్వం మరియు సౌహార్థతను ఉత్తేజిస్తుంది. విజయవంతమైన జట్టు వారి పరిసరాలకు గౌరవయుతంగా ఉంటారు. వారి యంత్రానికి కరుణ మరియు జట్టు సభ్యులను అర్థం చేసుకుంటారు.