Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ చైన్ వండర్లా హాలిడేస్ లిమిటెడ్, 31 డిసెంబర్ 2021న రాత్రి 8.30 గంటల నుంచి తన హైదరాబాద్ పార్క్‌లో 2022కు స్వాగతం పలికేందుకు ‘‘న్యూ ఇయర్ బాష్’’ ఈవెంట్నునిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో లైవ్ డీజే, బెల్లీ డ్యాన్స్ ప్రదర్శన, లైవ్ డ్యాన్స్ ఆర్టిస్ట్, లైవ్ బార్ మరియు బిబిక్యూకౌంటర్లు, బఫే డిన్నర్, బాణసంచా తదితర అనేక ఆకర్షణలు ఉంటాయి. టిఏఏ బెస్ట్ డీజే &ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అవార్డు 2018 విజేత, ఆసిఫ్ ఇక్బాల్ డీజే ప్రదర్శనకు నాయకత్వం వహిస్తారు. కొత్త ఏడాది కార్యక్రమాల్లో భాగంగా, వండర్లా తన వినియోగదారుల కోసం అద్భుతమైన ప్యాకేజీలతో ముందుకు వచ్చింది. ప్యాకేజీ-1లో ఈవెంట్ ఎంట్రీ టికెట్, బఫే డిన్నర్, బీవరేజ్ వోచర్ మరియు ఒక స్టార్టర్ జంటకు రూ.3499/-, ఒక్కరికి రూ.2499/- చెల్లించవలసి ఉంటుంది. ప్యాకేజీ-2లో ఈవెంట్ ఎంట్రీ టిక్కెట్ జంటకు రూ.1899/-మరియు ఒక్కరికి రూ.1499/- చెల్లించాలి. అలాగే, వండర్లా ఈవెంట్‌తో పాటు ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పార్క్ రైడ్లను ఆస్వాదించాలనుకునే వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీని జంటకు రూ.3899/- మరియు ఒక్కరికి రూ.2499/- (జిఎస్టితో కలిపి అన్ని ధరలు) చెల్లించాలి.
వండర్లా తన గెస్టులకు పిక్ అండ్ డ్రాప్ ఏర్పాట్లు కూడా చేస్తుండగా, వీటిని ముందుగా బుక్ చేసుకోవచ్చు మరియు ఈ సేవలకు అదనపు ఛార్జీలు ఉంటాయి. మరిన్ని వివరాలు మరియు బుకింగ్ కోసం, దయచేసి 91000 60336 నంబరును సంప్రదించండి. భౌతిక దూరాన్ని పాటించే ప్రోటోకాల్‌కు అనుగుణంగా వండర్లాను సందర్శించే వారికి ఎంట్రీ టిక్కెట్లను ఆన్లైన్ పోర్టల్ https://ny.wonderla.co.in/ ద్వారా ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని ప్రోత్సహిస్తోంది. భారతదేశంలో పరిశుభ్రత నిర్వహణ వ్యవస్థ కోసం BVQI నుంచి కొవ్-సేఫ్ ధృవీకరించబడిన మొదటి అమ్యూజ్మెంట్ పార్క్ వండర్లా. ఈ అమ్యూజ్మెంట్ పార్క్ రావిరాల విలేజ్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నం.13 వద్ద ఉంది. మరిన్ని వివరాలు లేదా బుకింగ్ కోసం వండర్లా వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://www.wonderla.com/ లేదా 040 23490300, 040 23490333నంబర్లకు కాల్ చేయండి.