Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తమ ప్రసిద్ధి చెందిన కుటుంబపు సిడాన్ హోండా అమేజ్ యొక్క 2వ తరం మోడల్ 2018 మేలో ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు భారతదేశంలో 200,000 డెలివరీల మైలురాయిని దాటిందని భారతదేశంలో ప్రముఖ ప్రీమియం కార్ల తయారీదారు హోండా కార్స్ డియా లిమిటెడ్ (హెచ్ సీఐఎల్), నేడు ప్రకటించింది. హోండా అమేజ్ భారతదేశంలో హోండా వారి అత్యంత విజయవంతమైన మోడల్స్ లో ఒకటి మరియు 2013 ఏప్రిల్ లో దీనిని మొదటిసారి ప్రారంభించిన నాటి నుండి మొత్తంగా 4.6 లక్షలకు పైగా కస్టమర్లు ఎంతగానో స్వీకరించారు. ఈ మైలురాయి గురించి మాట్లాడుతూ, శ్రీ గాకు నకనిషి, ప్రెసిడెంట్ &సీఈఓ, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు, "హోండా అమేజ్ మాకు ఎంతో ప్రధానమైన ఉత్పత్తి మరియు దీని విభాగంలో అత్యంత బలమైన మార్కెట్ స్థానాన్ని ఆనందించాము. అమేజ్ ని ప్రత్యేకించి భారతదేశపు కస్టమర్లని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేసాము మరియు కస్టమర్లు నుండి అందుతున్న ప్రేమ మరియు మద్దతు దాని యొక్క విస్త్రతమైన స్వీకరణని ఎంతగానో చెబుతోంది. ఇది మా వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది మరియు దేశంలోనే ఉత్తమంగా విక్రయించబడే సిడాన్లలో ఒకటిగా నిలిచింది. 2వ తరం అమేజ్ యొక్క 200,000 యూనిట్ల డెలివరీ హోండా కార్స్ ఇండియా కుటుంబానికి ఒక గర్వకారణం మరియు అలాంటి తరగతి-నిర్ణయించే ఉత్పత్తుల్ని మరింత పరిచయం చేయటానికి మా నిబద్ధతని ఇది పునరుద్ఘాటిస్తుంది. ఆయన ఇంకా ఇలా అన్నారు, " తమ మొదటి కారు నుండి మెరుగుపరచబడిన స్థోమత, సౌకర్యం మరియు మనశ్సాంతిలను ఆశించే కస్టమర్లు కోసం అమేజ్ ఒక గొప్ప ఎంపిక అని మేము విశ్విసిస్తాం." తన ప్రస్ఫుటమైన డిజైన్, ఆధునికమైన &విశాలమైన ఇంటీరియర్స్, సాటిలేని డ్రైవింగ్ సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు మరియు భద్రతా సాంకేతికతలతో తన తరగతి కంటే అధికంగా సిడాన్ అనుభవాన్ని ఇచ్చే హోండా అమేజ్ ఒక సమకాలీన సిడాన్. హోండా వారి యొక్క ఎంతగానో ప్రశంశలు పొందిన 1.2 లీ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీ ఐ-డిటెక్ డీజల్ ఇంజన్ ద్వారా కారు మద్దతు చేయబడుతోంది. రెండు ఇంధనం ఐచ్ఛికాలు కోసం మేన్యువల్ మరియు సీవీటీ వెర్షన్స్ రెండిటిలో కూడా లభిస్తోంది. అమేజ్ హోండా వారి వ్యూహాత్మకమైన ఎంట్రీ మోడల్, భారతదేశపు వినియోగదారు కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది మరియు ప్రత్యేకించి భారతదేశంలో తయారైంది. భారతదేశంలో ఉన్న తమ విలువైన సప్లైయర్స్ తో బలమైన సహకారం మరియు స్థిరమైన కేంద్రీకరణ అమేజ్ కోసం 95% కి పైగా స్థానికీకరణని సాధించడానికి హెచ్ సీఐఎల్ కి తోడ్పడింది. కారుకి అన్ని ఫీచర్లు గలవు, ఒక హోండా కారుతో గల విలువల్ని ఆపాదిస్తుంది. అమేజ్ టైర్ 2 మరియు 3 మార్కెట్లలో తన బలమైన మరియు ప్రసిద్ధి చెందిన ఉనికిని సంపాదించింది. ఈ మోడల్ సేల్స్ లో 68% ఈ పట్టణాలు నుండే వచ్చింది. సీవీటీ రకాలు అమేజ్ విక్రయాలు యొక్క 20%కి పైగా వాటాకి తోడ్పడ్డాయి మరియు కస్టమర్లలో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ మోడల్స్ యొక్క వృద్ధి చెందుతున్న ప్రాచుర్యాన్ని ప్రదర్శిస్తుంది. హోండా వారి శ్రేణిలో ఎంట్రీ మోడల్ బాధ్యతకి వాస్తవంగా, సుమారు ఈ కారు యొక్క 40% కస్టమర్లు మొదటిసారి కొనుగోలు చేసిన బయ్యర్లు, ఎందుకంటే మొదటి కారుగా అమేజ్ ఒక గొప్ప ఎంపిక, ఎంతో పెద్ద సిడాన్ స్థోమతని మరియు మనశ్సాంతిని హోండా వారి ప్రసిద్ధి చెందిన మన్నిక, నాణ్యత, నమ్మకం మరియు తక్కువ నిర్వహణ ఖర్చుని అందిస్తోంది.