Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే క్రిప్టో కరెన్సీ బిల్లు పార్లమెంట్‌కు రానుందని కేంద్రం తొలుత సంకేతాలు ఇచ్చిన్పటికీ ఈ సారి వాయిదా పడనుందని తెలుస్తోంది. సమావేశాలు డిసెంబర్ 23తో ముగియనుండగా.. ఇప్పటికీ డిజిటల్ కరెన్సీ బిల్లునపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాల గురించి కేంద్రం తుది నిర్ణయానికి రాలేదని సోమవారం పలు కథనాలు వచ్చాయి. సంబంధిత వర్గాలందరితో చర్చించాకే పక్కా బిల్లు రూపొందించామని, క్యాబినెట్ ఆమోదించాకే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లోనే క్రిప్టో బిల్లు రానుందని పరిశ్రమ వర్గాలు భావించాయి. ఇప్పుడు క్రిప్టో బిల్లు విషయంలో తొందరపాటు నిర్ణయం వద్దని తాజాగా కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని మార్పులు చేర్పులతో ఆర్డినెన్స్గానీ, ప్రత్యేక చట్టాన్ని గాన్ని తేవాలని కేంద్రం యోచిస్తోన్నట్టు సమాచారం.