Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : క్రిస్మస్, నూతన సంవత్సర సంబరాలతో ఫోరమ్ సుజనా మాల్ తమ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌ను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లలో ఉత్తమమైనవిగా నిలిచే వాటిలో రాయితీలను అందజేయడమే కాకుండా, రూ. 10,000ల కంటే ఎక్కువ షాపింగ్ చేసే ఏ వినియోగదారుడైనా తమ ఇంటికి అద్భుతమైన బహుమతులను తీసుకెళ్ళవచ్చు. మీరు ఎంత ఎక్కువగా షాపింగ్ చేస్తే, ఫోరమ్ సుజనా మాల్ నుండి అంత ఎక్కువ సంతృప్తిని పొందుతారన్నమాట. గొప్ప డీల్స్, రాయితీలు, హామీ ఇచ్చిన బహుమతులు మాత్రమే కాదు ఫోరమ్ సుజనా మాల్, హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకమైన సెటప్‌ను తీసుకొచ్చింది. ఫోరమ్ సుజనా మాల్ హైదరాబాద్‌లో తొలిసారిగా 'ది డ్రాగన్స్ లైర్'ని హైదరాబాదీయులకు పరిచయం చేస్తోంది. మంచుతో కప్పబడిన శిఖరాలు, ఆధ్యాత్మిక కోటలు, మాంత్రిక జీవులు అన్నీ ఈ అద్భుతమైన ప్రపంచంలో భాగమవుతాయి. ఫోరమ్ సుజనా మాల్లో యాక్రిలిక్ గ్లాస్ డ్రాగన్లు, స్నోఫ్లేక్స్తో కూడిన మంచు వృక్షజాలం, జంతుజాలంతో కూడిన కొన్ని ఆసక్తికరమైన హ్యాంగింగ్‌లు ఉన్నాయి. ఇది డ్రాగన్‌ని కలవడానికి, ఆనందించడానికి పిల్లల కోసమే ప్రత్యేకించిన పూర్తి కలల ప్రపంచం. డ్రాగన్ ను కలవవచ్చు. ఎంతో సంతోషాన్ని పొందవచ్చు. ఆసక్తికరమైన మంచు-సింహాసన ఫోటో బూత్, డ్రాగన్ గుడ్డును మీకు మీరే సొంతంగా తయారు చేసే ఏర్పాటు, డ్రాగన్ పినాటా, ఇంకా ఎన్నో ఆసక్తికరమైన పిల్లల కోసం ఏర్పాటు చేశారు. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ క్యాంపెయిన్‌లో భాగంగా, డిసెంబర్ 15 నుండి ఫోరమ్ సుజనా మాల్లో 50కి పైగా బ్రాండ్లు విక్రయించబడతాయి. అదనంగా, ఫోరమ్ సుజనా మాల్ గత ఆరు నెలలుగా ఓర్రా, ASICS, Baggit, UCB ఫ్యామిలీ, కృష్ణపట్నం, కాలిఫోర్నియా బర్రిటోస్, Taco Bell, Haldirams, Theobroma, Qaffeine వంటి బ్రాండ్లను కూడా జోడించింది. దీంతో వినియోగదారులు ఎప్పుడూ ఎదురుచూసే కొత్తదనాన్ని మాల్‌లోకి అందించినట్లైంది.