Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశానికి ఇష్టమైన సంగీత యాప్ గానా, నేడు పరిశ్రమలోని వ్యక్తులు, కళాకారులు మరియు సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక సమగ్ర నివేదిక- ఇండియా మ్యూజిక్ ట్రెండ్స్ 2021ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా, ఇది సంగీత ప్రపంచంలోని అత్యుత్తమ పోకడలు, అభిప్రాయాలను కవర్ చేస్తుంది. సుమారు 180 మిలియన్లకు పైగా శ్రోతల వినియోగ ప్రవర్తనల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ప్రాంతీయ కంటెంట్ వినియోగం నుంచి పాడ్‌క్యాస్ట్ వినియోగం వరకు వృద్ధి, ప్రత్యేకమైన కంటెంట్ మరియు ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా అభిమానులు మరియు కళాకారుల మధ్య మెరుగైన ఎంగేజ్మెంట్ వరకు దేశంలోని సంగీతం మరియు ఆడియో శ్రవణ ప్రాధాన్యతలలో ఆసక్తికరమైన పోకడలు మరియు మార్పులను ఈ నివేదికలో పొందుపరిచారు. ప్రతి ఒక్కరికీ 2021 ఒక భయంకరమైన సంవత్సరం అయినప్పటికీ సంగీతం ఒక వైద్యంగా, వినోదానికి అవసరమైన మూలంగా నిలిచింది. ఆడియో కంటెంట్ ఆరోగ్యకరమైన శక్తిగా మరియు స్క్రీన్ రహిత వినోదంతో వినియోగదారులను ఎంగేజ్ చేసే మార్గంగా నిలిచింది. గానాలో 1.2 బిలియన్లకు పైగా స్ట్రీమ్‌లతో 2021లో తనిష్క్ బాగ్చి అత్యధికంగా వినిపించిన కళాకారునిగా నిలువగా, ఆ తర్వాత స్థానాల్లో అరిజ్త్ సింగ్ మరియు నేహా కక్కర్ నిలిచారు. ‘లుట్ గయే’, ‘బేవఫా తేరా మసూమ్ చెహ్రా’ మరియు ‘రాతన్ లంబియాన్’ 2021లో అత్యధికంగా వినిపించిన పాటలు కాగా, ‘షెర్షా’, ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డి’ మరియు ‘కబీర్ సింగ్’ ఎక్కువగా వినియోగించబడిన ఆల్బమ్‌లు. తనిష్క్ బాగ్చి, నేహా కక్కర్, బి ప్రాక్ మరియు బాద్షా తదితర కళాకారులు ఇతర ప్లాట్‌ఫారాల కన్నా గానాలో 2X ఎక్కువ స్ట్రీమ్‌లను సంపాదించారు.
ఏడాది నుంచి-ఏడాదికి- పోల్చితే పాడ్‌క్యాస్ట్‌ల వినియోగం 2021లో~40 శాతం వృద్ధి చెందింది. గానాలో పెరుగుతున్న లైబ్రరీ 40,000 పాడ్‌క్యాస్ట్‌లు మరియు ఆసక్తులతో ఈ పెరుగుతున్న అవసరాలను పరిష్కరించింది. ‘మ్యూజిక్’, ‘మోటివేషన్’, ‘స్టోరీస్’ మరియు ‘డివోషనల్’ అనేవి చార్ట్‌లలో ఆధిపత్యం చెలాయించిన జానర్లు మరియు ‘రియాస్ రెట్రో’ 2021లో అత్యధికంగా వినిపించిన పాడ్‌కాస్ట్. ప్రాంతీయ మార్కెట్ల నుంచి కూడా పాడ్‌క్యాస్ట్‌లకు డిమాండ్ వృద్ధి చెందగా, వినియోగాన్ని గత ఏడాదితో పోల్చితే 32% వృద్ధి చెందింది. కేవలం పాడ్‌క్యాస్ట్‌లు మాత్రమే కాకుండా, ప్రాంతీయ సంగీతం పట్ల ప్రేమ కూడా 2021లో గతంలో కన్నా మరింత శక్తివంతంగా, మొత్తం స్ట్రీమ్‌లకు ~40% సహకారాన్ని అందించింది. భోజ్‌పురి & హర్యాన్వి గత ఏడాదితో పోల్చితే 15% కన్నా ఎక్కువ రాబడితో అత్యధికంగా లాభపడ్డాయి.
ప్రజాదరణ పొందిన ఆడియోతో పాటు, క్యూరేటెడ్ అనుభవాలు మరియు ప్రీమియం కంటెంట్‌కు వినియోగదారుల నుంచి చక్కని ఆదరణను అందుకున్నాయి. ‘గానా లైవ్’, ప్రత్యేకమైన లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ ప్లాట్‌ఫారమ్ కాగా, 2021లో శంకర్ ఎహసాన్ లాయ్‌తో సహా అత్యుత్తమ కళాకారుల్లో కొందరికి హోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో 17,000 మంది సబ్స్క్రైబర్లు గానా యాప్‌లో సంగీత మాస్ట్రోలను ప్రత్యక్షంగా వీక్షించారు. గ్లోబల్ స్టార్ దువా లిపా సంగీత కచేరీకి గానాలో 1.4 లక్షల కన్నా ఎక్కువ మంది హాజరయ్యారు. అలాగే, 4-రోజుల ‘గానా ఇండీ ఫెస్ట్’లో 1.5 లక్షల మంది వీక్షకులు లైవ్ ప్రదర్శనలు ఇచ్చిన ఇండీ కళాకారులపై ప్రేమను కనబరిచారు. గానా సీఈఓ సందీప్ లోధా నివేదిక గురించి మాట్లాడుతూ, ‘‘గానా 2021లో, సంగీతం మరియు ఆడియో కంటెంట్ కేవలం వినోదానికి మూలం నుంచి భావోద్వేగానికి మద్దతుగా మార్పు సంతరించుకుంది. మన దైనందిన జీవితంలో మరింత కీలక పాత్రను పోషిస్తూ, రొటీన్ చట్రం నుంచి బయటపడటానికి మనకు సహాయపడుతుంది. ఒరిజినల్ ఆడియో స్ట్రీమింగ్ ప్లేయర్ మరియు దేశంలో అత్యంత ఇష్టపడే మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌గా గుర్తింపు దక్కించుకుని, కస్టమర్ సెంట్రిసిటీ, ఆవిష్కరణలు మరియు టార్గెటెడ్ ఆడియన్స్ ఔట్ రీచ్‌పై దృష్టి సారించిన గానాలో మా సమగ్ర ప్రయత్నాలతో ఆడియో ల్యాండ్‌స్కేప్ మొత్తాన్ని అభివృద్ధి చేయడంలో సహకరించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గానా ఇండియా మ్యూజిక్ ట్రెండ్స్ 2021 నివేదిక 180 మిలియన్ల కన్నా ఎక్కువ మంది శ్రోతల ఆడియో ప్రాధాన్యతలు మాత్రమే కాకుండా పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న కొన్ని పోకడలను క్యాప్చర్ చేసింది. గానాలో మేము ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఆడియో పర్యావరణ వ్యవస్థలో అగ్రగామిగా ఉండటమే కాకుండా, మా స్ట్రీమింగ్ ప్లాట్ఫారానికి నాణ్యమైన కంటెంట్ మరియు క్లాస్ ఇండస్ట్రీలో అత్యుత్తమ ఫీచర్లతో కొత్త భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేస్తాము’’ అని పేర్కొన్నారు.