Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఇండియన్ గ్యాస్ ఎక్సేంజీ(ఐజీఎక్స్)లో ఇండియన్ ఆయిల్ 4.93శాతం వాటాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఇందుకో సం ఇండియన్ ఆయిల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారని ఆ సంస్థ మంగళవారం బాంబే స్టాక్ ఎక్సేంజీకి సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 20న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఐజీఎక్స్లో 4.93శాతం వాటాకు సమానమైన రూ.10విలువ కలిగిన 36,93,750ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. 2020జూన్ 15న ఐజీ ఎక్స్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇందులో ఓఎన్జీసీ, గెయిల్, అదానీ టోటల్ గ్యాస్, టొరెంట్ గ్యాస్ ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి