Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుస నష్టాలతో బెంబేలెత్తుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం ఉపశమనం లభించింది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమ క్రమంగా నేల చూపులు చూసినప్పటికీ.. రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఔషధ, ఇంధన, లోహ, ఐటీ రంగాల షేర్ల మద్దతుతో తుదకు సెన్సెక్స్ 497 పాయింట్లు లేదా 0.89 శాతం పెరిగి 56,319కు చేరింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 156.60 పాయింట్లు లేదా 0.94 శాతం రాణించి 16,771 వద్ద ముగిసింది. నిఫ్టీలో రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఔషద, ఇంధన, లోహ, ఐటి రంగాల సూచీలు 1-3 శాతం మేర పెరిగాయి బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పెరిగాయి.