Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1250 కోట్ల సమీకరణ లక్ష్యం
న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ వేదిక స్నాప్డీల్ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. ఇందుకోసం తమ ప్రతిపాదిత డ్రాప్టును సెబీకి దరఖాస్తు చేసింది.ఈ ఇష్యూ ద్వారా రూ.1250 కోట్ల నిధులు సమీకరిం చాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇష్యూలో 30,769,600 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్టు వెల్లడించింది. ఐపీఓ నిధులను వద్ధి కార్యక్రమాలు, సాధారణ కార్పోరేట్ కార్యకలాపాల కోసం వినియోగించ నున్నట్టు తెలిపింది. 2010లో ఆన్లైన్ విక్రయ సేవలు ప్రారంభించిన ఈ సంస్థ ప్లేస్టోర్లో 2 కోట్ల పైగా డౌన్లోడ్లను కలిగి ఉంది.