Authorization
Mon Jan 19, 2015 06:51 pm
–హిమాచల్ ప్రదేశ్ ఎఫ్ఎస్ఎల్ , అసిస్టెంట్ డైరెక్టర్ (డీఎన్ఏ డివిజన్), డాక్టర్ వివేక్ సహజ్‌పాల్
హైదరాబాద్: కరడుగట్టిన నేరస్తులతో పాటుగాపదే పదే నేరాలు చేసి తప్పించుకు తిరుగున్న వ్యక్తులను కనిపెట్టేందుకు డీఎన్ఏ డాటా బేస్ ఉపయోగపడుతుందని హిమాచల్ ప్రదేశ్ ఎఫ్ఎస్ఎల్ , అసిస్టెంట్ డైరెక్టర్ (డీఎన్ఏ డివిజన్), డాక్టర్ వివేక్ సహజ్‌పాల్ అన్నారు. చట్టనియంత్రణ సంస్ధల ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ డాటాబేస్‌తో ఏ వ్యక్తి గోప్యతకు భంగం కలగదు. ఎందుకంటే ఇది కేవలం నేరస్తులకు సంబంధించిన సమాచారం మాత్రమే నిక్షిప్తం చేసుకుంటుంది. ఈ డాటాబేస్‌తో ఎలాంటి నేరాలు చేసిన వారినైనా పట్టుకోవడం సాధ్యమవుతుందన్నారు వివేక్. ఆయనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఆయన వెల్లడిస్తూ అనుమానాస్పద వ్యక్తుల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించడమంటూ ఉండదు. ఆధారాల ఆధారంగా మాత్రమే డీఎన్ఏ నమూనాలు విశ్లేషించడం, సరిపోల్చడం జరుగుతుందన్నారు.
డీఎన్ఏ నమూనాల ఆధారంగా నేరస్తుని గుర్తించే విధానం గురించి వివేక్ మాట్లాడుతూ ‘‘ఓ నేరం జరిగినప్పుడు, ఆ సంఘటనలో నేరస్తుని డీఎన్ఏ లభించే అవకాశాలున్నాయి. సాధారణంగా పరిశోధకులు తమకు లభించిన నమూనాలను, అనుమానాస్పద వ్యక్తుల నమూనాలతో పోల్చి చూస్తారు. దీనితో పాటుగా తమ దగ్గర ఉన్న డీఎన్ఏ డాటా బేస్ తో సరిపోల్చుతారు. ఈ అంశాలు సరిపోలితే ఆ వ్యక్తిని న్యాయస్థానాల ముందు ప్రవేశపెడతారు. ఆ వ్యక్తి నేరం చేసినట్లు రుజువైన తరువాత ఆ వ్యక్తి సమాచారం డీఎన్ఏ డాటా బేస్‌లో చేరుతుంది. ఒకవేళ ఏదైనా కేసులో అనుమానాస్పద వ్యక్తులెవరూ లేనప్పుడు నేరం జరిగిన ప్రదేశంలో లభించిన డీఎన్ఏ ప్రొఫైల్స్‌తో డాటాబేస్ సరిచూసి కేసు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. డీఎన్ఏ డాటా బేస్ వల్ల కేసును సరైన దిశలో పరిష్కరించడం వీలవుతుందన్నారు.
‘‘మనదేశంలో డీఎన్ఏ సాంకేతికతను చివరి అస్త్రంగా వినియోగిస్తున్నారు. మన దేశంలో గుడియా కేసు ఈ డీఎన్ఏ సాంకేతికత ద్వారా పరిష్కరించిన కేసులలో అత్యంతకీలకమైన కేసుగా నిలిచింది. అయితే ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనదేశంలో ఇంకా దీని వినియోగం తక్కువనే చెప్పాలి.మన దగ్గర చెప్పుకోతగ్గ స్ధాయిలో క్రిమినల్ డాటా బేస్ లేకపోవడమూ దీనికి ఓ కారణంగా వెల్లడించాల్సి ఉంటుద’’న్నారు వివేక్. ఆయనే మాట్లాడుతూ పూర్తిగా అంకితం చేయబడిన డాటా బేస్ మన దగ్గర కూడా ఉంటే అపరిష్కృతమైన ఎన్నో కేసులకు తగిన పరిష్కారమూ లభిస్తుందన్నారు.
ఈ డాటా బేస్‌లో సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు లేకపోలేదని అంగీకరించిన వివేక్, విదేశాలలో ఆ సమస్యకు తగిన పరిష్కారాలను కనుగొన్నారు. ఐటీ, సెక్యూరిటీ పరంగా అగ్రదేశాలలో ఒకటిగా నిలిచిన ఇండియాలో ఈ డాటా రక్షణ పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్ధితులలో ఇండియాకు డీఎన్ఏ డాటాబేస్ విస్తృతంగా ఉండాల్సి ఉందని చెబుతూ దేశవ్యాప్తంగా ఈ డీఎన్ఏ సేకరణ ఓ ప్రామాణీకర పద్ధతిలో జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.