Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుసగా రెండో రోజూ భారత స్టాక్ మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకింగ్, ఆటో సూచీల ప్రధాన మద్దతుతో బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ 612 పాయింట్లు పెరిగి 56,931కి చేరింది. ఇంట్రాడేలో ఈ సూచీ 56,989 గరిష్ట స్థాయి వద్ద నమోదైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 184 పాయింట్లు పెరిగి 16,955కి చేరింది. సెన్సెక్స్-30లో అత్యధికంగా రిలయన్స్ ఇండిస్టీస్ 2.4 శాతం లాభపడింది. భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టి, టాటా స్టీల్ సూచీలు 2 నుంచి 2.7 శాతం మేర అధికంగా పెరిగిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. విత్త రంగంలో బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ సూచీలు రాణించాయి. ఐటీసీ, నెస్ట్లే, విప్రో సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.5 శాతం చొప్పున పెరిగాయి. మొత్తంగా 2400 స్టాక్స్ లాభపడగా.. 907 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.