Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే మూడేండ్లలో భారత్‌ను సెమికండక్టర్ చిప్స్ తయారీ కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాబోయే రెండు, మూడేండ్లలో కనీసం డజను సెమీకండక్టర్ తయారీ ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. చిప్‌ల తయారీ పరిశ్రమ కోసం అందుకు అనువైన పర్యావరణ వ్యవస్థను అభివద్ధి చేసేందుకు కృషి జరుగుతుందన్నారు. చిప్ తయారీలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా నిలిపేందుకు గత వారం ప్రముఖ చిప్ కంపెనీలను ఆకర్షించడానికి రూ.76,000 కోట్ల పథకానికి ఆమోదం తెలిపిందన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో స్వావలంబన సాధించడం, భారీ పెట్టుబడులు తీసుకురావడం, లక్ష మందికి పరోక్ష ఉపాధితో పాటు 35,000 ప్రత్యేక ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.