Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాము అభిమానించే అమేజాన్ షాపింగ్ యాప్ నుండి బై నౌ పే లేటర్, అమేజాన్ పే యూపీఐ, అమేజాన్ పే బ్యాలెన్స్ మరియు ఇంకా ఎన్నో వాటి నుండి చెల్లింపు ఉత్పత్తుల ఉత్తేజభరితమైన సమాహారం గురించి చైతన్యాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంగా అమేజాన్ పే 'యు హావ్ ఇట్, యు జస్ట్ డిడ్ నాట్ నో ఇట్'- కొత్త క్యాంపైన్ ఆరంభాన్ని ప్రకటించింది. దీనితో, అమేజాన్ పేతో కస్టమర్లు తాము చేయగలిగేది మరియు తమ దైనందిన జీవితంలో చెల్లింపుల్ని పెంపొందించడానికి మరియు సరళతరం చేయడానికి ఈ పరిష్కారాల్ని ఏ విధంగా ఉపయోగించాలో సులభంగా అర్థం చేసుకోగలరు. భారతదేశంలో ఎవరికైనా, ఎక్కడైనా అమేజాన్ పేని వెంటనే మరియు శ్రమ లేకుండా ఏ విధంగా ఉపయోగించవచ్చో వివిధ లఘు సినిమాలు ప్రదర్శన ఈ కాంపైన్ లో ఉంటాయి. కాంపైన్ గురించి మాట్లాడుతూ, మహేంద్ర నెరూర్కర్, సీఈఓ &వీపీ, అమేజాన్ పే ఇండియా ఇలా అన్నారు, "నేడు కస్టమర్లు నమ్మకమైన, సౌకర్యవంతమైన మరియు బహుమానపూర్వకంగా ఉండే సమగ్రమైన డిజిటల్ అనుభవాలు మరియ చెల్లింపు పరిష్కారాలు కోసం అన్వేషిస్తున్నారు. amazon.in యాప్ కలిగిన ఎవరికైనా అమేజాన్ పే ఏ విధంగా లభిస్తుందో ప్రదర్శించడానికి మరియు వివిధ ఉత్పత్తులు &ప్రయోజనాల్ని వారికి కేటాయించడం ద్వారా కస్టమర్ల జీవితాల్ని సరళతరం చేసే ప్రయత్నమే మా 'యు హావ్ ఇట్, యు జస్ట్ డిడ్ నాట్ నో ఇట్' కాంపైన్. ఈ కాంపైన్ ద్వారా, డిజిటల్ చెల్లింపులలో ఉండే సౌకర్యం మరియు అమేజాన్ పే కోసం డ్రైవ్ స్వీకరణ యొక్క భావనని మరింత బలోపేత్తం చేసే కస్టమర్ కేంద్రీకృతమైన కథల్ని మేము రూపొందించాము.'' లక్షలాది కస్టమర్ల జీవితాల్ని అమేజాన్ పే ఏ విధంగా సరళతరం చేసింది కాంపైన్ చిత్రీకరించింది. ఉత్తేజభరితమైన షాపింగ్ బహుమతులు నుండి బై నౌ పే లేటర్ ఐచ్ఛికం, తక్షణమే క్రెడిట్ పరిష్కారాలు వరకు , అమేజాన్ పే యూపీఐ ద్వారా ఏదైనా యూపీఐ క్యూఆర్ కోడ్ ని స్కానింగ్ చేయడం, ఇంటి వద్ద క్యాష్ లోడ్ చేయడం మరియు ఇంకా ఎన్నో ఇతర ఫీచర్లు ద్వారా కస్టమర్లు మరియు వ్యాపారులు దేశవ్యాప్తంగా అమేజాన్ పేని ఆన్ లైన్ లో &ఆఫ్ లైన్ లో ఉపయోగించగలరు. బ్రాండ్ ఫిల్మ్స్ కోసం సంభాషణాపరమైన ఏర్పాట్లు సర్వవ్యాప్తిని, బహుమానపూర్వకమైన విస్త్రతి, తక్కువ ఖరీదులో, చెల్లింపులు సులభంగా చేయడాన్ని పెద్ద ఎత్తున కస్టమర్లకు ప్రధానాంశంగా చూపిస్తాయి. 45 రోజుల ఈ ప్రచారం టెలివిజన్, సామాజిక మాధ్యమం, బయట, ఆన్ సైట్ మరియు వ్యాపారుల స్టోర్స్ లో 360 డిగ్రీల సమాచారం ద్వారా చూపించబడుతుంది మరియు చమత్కారమైన, గుర్తిండిపోయే నినాదం 'యు హావ్ ఇట్, యు జస్ట్ డిడ్ నాట్ నో ఇట్' ద్వారా సారాంశాన్ని అందిస్తుంది. యుటిలిటి బిల్లులు మరియు రెస్టారెంట్ బిల్లులు చెల్లించడం నుండి ప్రయాణం టిక్కెట్లు బుక్ చేయడం, డబ్బులు బదిలీ చేయడం మరియు ఇంకా ఎన్నో రకాల పెద్ద ఎత్తున వాడకం కేసుల శ్రేణిని అమేజాన్ పే అందిస్తుంది. నిరంతరంగా షాప్ చేయడానికి అమేజాన్ పే లేటర్, అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ &అమేజాన్ పే యూపీఐ సహా అమేజాన్ పై వివిధ చెల్లింపు విధానాల్ని కస్టమర్లు ఉపయోగించవచ్చు. తమ బడ్జెట్ ని విస్తరించి మరియు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బ్యూటీ &ఫ్యాషన్, డిజిటల్ గోల్డ్ మరియు ఇంకా ఎన్నో వివిధ తరగతులలో తాము అభిమానించే వస్తువులు కోసం షాపింగ్ చేసే సౌలభ్యం కూడా వారికి ఉంది.