Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆస్తమా మరియు దానికి సంబంధించిన అపోహలు మరియు భయాందోళనను నివారించే మరియు ఆస్తమా ఉన్నవారికి పరిమితులు లేని పూర్తి జీవితాన్ని గడిపేందుకు ఉత్తేజించే జాగృతి కార్యక్రమాన్ని #ఇన్హేలర్స్హైసహీ (#InhalersHainSahi) పేరిట సిప్లా లిమిటెడ్ మద్ధతుతో నిర్వహిస్తున్నట్లు నేడు ప్రకటించారు. ఇన్హేలర్ల వినియోగం చుట్టూ ఉన్న అపోహలను నివారించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ జాగృతి ద్వారా సామాజికంగా అంగీకరించే అలాగే రోగులు మరియు వారి వైద్యుల మధ్య చర్చను ఉత్తేజించే ఉద్దేశాన్ని కలిగి ఉంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్ ప్రకారం, ‘‘భారతదేశంలో 93 మిలియన్ ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత రోగాలను ఎదుర్కొంటున్నారు; వారిలో 37 మిలియన్ల మందికి ఆస్తమా ఉంది. గ్లోబల్ ఆస్తమా ఒత్తిడిలో భారతదేశం 11.1% వాటా కలిగి ఉండగా, ఇది గ్లోబల్ ఆస్తమా మరణాల్లో 42%మేర వాటాకు కారణం కాగా, దీన్ని ప్రపంచ ఆస్తమా మరణాల రాజధానిగా మార్చింది2’’ హైదరాబాద్లోని ప్రభుత్వ జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్లో చెస్ట్ ఫిజీషియన్ డా.మెహబూబ్ ఖాన్ మాట్లాడుతూ, ‘ఆస్తమా మరియు ఇన్హేలర్స్ గురించి దృష్టికోణంలో మార్పులు చేసుకోవలసిన అవసరం చాలా ఉంది. ఇన్హేలర్లు ప్రజల జీవితంలో ఆస్తమా పరిణామాన్ని తక్కువ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇన్హేలర్స్ ఔషధాన్ని నేరుగా ఊపిరితిత్తులకు అందిస్తాయి మరియు సమస్య తీవ్రమయ్యే లక్షణాలను అడ్డుకుని ఆస్తమాను నియంత్రిస్తాయి. అదేమైనప్పటికీ, ఇన్హేలర్స్ వినియోగించే రోగులు వారి వైద్యుల సలహాలపై దృష్టి పెడితే మరియు ప్రిస్క్రిప్షన్ అనుసరిస్తే మాత్రమే అవి చక్కని ప్రభావాన్ని చూపిస్తాయి’’ అని పేర్కొన్నారు.
దీని గురించి డా.మెహబూబ్ ఖాన్ మరింత వివరిస్తూ, ‘‘ఆస్తమాతో బాధపడుతున్న ప్రజల సంఖ్య ఎక్కువైంది మరియు బాధిత రోగులకు సరైన చికిత్స గురించి అవగాహన కల్పించేందుకు చాలా శ్రమించవలసిన అవసరం ఉంది. ఆస్తమాను పూర్తిగా మేలు చేయడం సాధ్యం కాకపోయినా, దానిపై నియంత్రణ సాధించడం సాధ్యం మరియు సహజ సక్రియమైన జీవనాన్ని నడపడం సాధ్యమవుతుంది. ఇక్కడ సరైన చికిత్స మరియు ఆస్తమా నిర్వహణకు కట్టుబడి ఉండడం ముఖ్యం. గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ ఆస్తమా (GINA) మార్గదర్శకాల ప్రకారం ఇన్హేలర్లు ఆస్తమా నియంత్రణకు సురక్షితమైన పరిణామకారి విధానం అని తెలిపాయి. ఎందుకంటే అవి మీ ఊపిరితిత్తులకు నేరుగా చేరుతాయి మరియు ఔషధం తక్షణమే పని చేయడం ప్రారంభిస్తుంది’’ అని వివరించారు. సిప్లాలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జైదీప్ గాగ్టే మాట్లాడుతూ, ‘‘తీవ్రత కలిగిన రోగంగా పేర్కొంటున్న ఆస్తమా గురించి జాగృతి కల్పించడం అత్యంత కీలక అంశం. #ఇన్హేలర్స్హైసహీ (#InhalersHainSahi) జాగృతి ద్వారా ఆస్తమా రోగులకు ఇన్హేలర్ల వినియోగంతో అడ్డంకులు లేని జీవితాన్ని నిర్వహించేందుకు మద్ధతు ఇచ్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నావు. మా ప్రయత్నాలు ప్రజలకు వారి వైద్యుల మార్గదర్శనాలకు అనుగుణంగా అవసరమైన చర్యలను తీసుకునేందుకు ఉత్తేజిస్తున్నాము. ఈ పోకడ అలాగే ప్రవర్తనల్లో మార్పురాగా, దాన్ని రోగాన్ని నియంత్రించేందుకు, దాన్ని రోగులకు ఎక్కువ సమాచారం అలాగే విషయాన్ని అర్థం చేసుకునేలా చేయడం ద్వారా వారిలో జాగృతి కల్పించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము. అలాగే దాన్ని ఉత్తమ రీతిలో నిర్వహించేందుకు #ఇన్హేలర్స్హైసహీ (#InhalersHainSahi) భయం లేదా ఆందోళన లేకుండా ఇన్హేలర్లను వినియోగించేందుకు అర్థం చేసుకునే మరియు అంగీకరించే ఉద్యమంగా ఉంది’’ అన్నారు. ఆస్తమా నియంత్రణ మా పరిధిలో ఉంది మరియు పూర్తి సంతృప్తితో జీవితాన్ని గడపడం సాధ్యం. ఇన్హేలర్లను ఉపయోగించడం, రోగ లక్షణాలను నియంత్రించడం మరియు ఆస్తమా రోగుల జీవితంలో నాణ్యతను మెరుగుపరచేందుకు మద్ధతు ఇస్తాయి.