Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గ్యానీస్ తన మొట్టమొదటి అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ప్రారంభించింది. ఢిల్లీలోని చాందినీ చౌక్ లో 64 సంవత్సరాల పురాతన బ్రాండ్ అయిన గియానీస్ తన తొలి ఔట్ లెట్ ను జూబ్లీహిల్స్ లో ప్రారంభించడంతో తమ బ్రాండ్ ను మరింత విస్తరించినట్లైంది. గియానీస్ చైర్మన్ శ్రీ పరమ్ జీత్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఔట్ లెట్ 1100 చదరపు అడుగుల వైశాల్యంలో తీర్చిదిద్దారు.
ఈ బ్రాండ్ తన ఉనికిని విస్తరించడానికి నగరవ్యాప్తంగా మరో 7 అవుట్లెట్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే తమ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ప్రస్తుతం మరో రెండు ఔట్లెట్స్ బంజారాహిల్స్, ప్రగతి నగర్ లలో ఈ వారమే ప్రారంభం కానున్నాయి. దక్షిణాదిలోకి ప్రవేశించిన గ్యానీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గురుప్రీత్ సింగ్ మాట్లాడుతూ “సాంస్కృతికంగా గొప్ప నగరమైన ముత్యాల నగరం హైదరాబాద్‌లో ఎట్టకేలకు అడుగు పెట్టాము. ఇక్కడి డెజర్ట్ ప్రియులను మా మిఠాయిలతో అలరించేందుకు ఎంతో ఉద్వేగంతో ఎదురుచూస్తున్నాం. అనుకున్న ఘడియ రానే వచ్చింది. ” అన్నారు. గియానీస్ బ్రాండ్ మూడవ తరపు వారసత్వాన్ని కొనసాగిస్తున్న గురుప్రీత్ సింగ్, అమర్‌ప్రీత్ సింగ్, కన్వర్ప్రీత్ సింగ్, ఆనంద్ప్రీత్ సింగ్ ల సమన్వయ సహకారాలతో గియానీస్ భారతదేశం అంతటా 180 శాఖలతో విస్తరించింది. డిసెంబర్ 22న ప్రారంభమయ్యే స్టోర్ లలో విభిన్నమైన శ్రేణిలో సరికొత్త రుచులు పరిచయం చేయాలనుకుంటున్నారు. బ్రౌనీ నుటెల్లా, ఫెర్రెరో రోచర్, కారామెల్ క్రంచ్, లెట్స్ గో నట్టి, ఓరియో డ్రీమ్, బెల్జియన్ వాఫిల్ లతోపాటు గియానీస్ ఫలూదా, కుల్ఫీ థిక్ షేక్స్, కేకులు, వంటి అనేక రకాల వస్తువులను అందిస్తుంది. 50కి పైగా ఐస్ క్రీం రుచులు లభ్యం అవుతాయి. ఢిల్లీ ఆత్మను పట్టిచూపే చాందినీ చౌక్ లోని ఢిల్లీ-6 ఫతేపురిలో 1956లో దివంగత ఎస్. గుర్చరణ్ సింగ్ గియానీ డి హట్టి ను ఒక బ్రాండ్ గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా స్టోర్స్ ప్రారంభించడంతో పాటు మరో మూడు ఐస్‌క్రీమ్ పార్లర్లను హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయడంతో దేశవ్యాప్తంగా బ్రాండ్ ను విస్తరించినట్లైంది. క్రియేటివ్ డైరెక్టర్ ఆనంద్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ “డెజర్ట్ కేటగిరీలో 64 సంవత్సరాల నుండి మాదైన పాత్ర పోషిస్తూనే ఉన్నాము. అప్పటి నుండి అనేక మంది వినియోగదారులను సంపాదించుకున్నాము. మేము అందించే తీపిలో నాణ్యతకు మార్గదర్శకులుగా కొనసాగుతున్నాం. అందుకే వినియోగదారుల ప్రేమను సొంతం చేసుకున్నాం. హైదరాబాద్‌లో మాకు భారీ మార్కెట్ ఉన్నట్లు తెలుస్తోంది. వినియోగదారులకు చేరువగా ఉంటే ఈ ఆదరణ మరింత విస్తృతమవుతుందని నమ్ముతున్నాం." అని అన్నారు.