Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2021లో 63 ఐపిఒలు నమోదు
ముంబయి : ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు 63 కంపెనీలు ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు వచ్చి రూ.1.18 లక్షల కోట్ల నిధులను సమీకరించాయి. 2020 నాటి రూ.26,613 కోట్ల ఇష్యూలతో పోల్చితే 4.5 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. 2017లో గరిష్టంగా రూ.68,827 కోట్ల విలువ చేసే ఇష్యూలు రాగా.. ఆ తర్వాత 2021లోనే రికార్డ్ ఐపిఒలు నమోదయ్యాయి. ప్రైమ్‌డేటా బేస్ ప్రకారం.. ప్రస్తుత ఏడాదిలో పబ్లిక్ ఈక్విటీలో రూ.2,02 లక్షల కోట్ల నిధుల సమీకరణ జరిగింది. పేటియంకు చెందిన వన్ 97 కమ్యూనికేషన్స్ రూ.18,300 కోట్ల నిధులు రాబట్టుకుంది. జొమాటో రూ.9,300 కోట్లు సమీకరించింది. 59 ఇష్యూల్లో.. 36 సంస్థలు కూడా 10 రెట్ల అదనపు సబ్‌స్క్రిప్షన్‌ను నమోదు చేశాయి.