Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ కొత్త ఏడాదిలో ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకుల ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ కంపెనీ గురువారం రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. మోడల్‌ను బట్టి సుమారు రూ.2000 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సెప్టెంబర్‌లోనూ పలు వాహనాలపై రూ.3,000కు పెంచింది.