Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) జారీ ద్వారా రూ.103.6 కోట్లు సమీకరించింది. క్విప్ విధానంలో చాలా కంపెనీలు డిస్కౌంట్‌పై ఈక్విటీ షేర్లను జారీ చేస్తుండగా.. మోల్డ్‌టెక్ క్విప్ ఫ్లోర్ ప్రైస్‌పై 2.44 శాతం ప్రీమియం సాధించడం విశేషం. ఒక్కొక్కటి రూ.740ల చొప్పున మొత్తం 14,00,000 ఈక్విటీ షేర్లను కేటాయిం చారు. గోల్డ్‌మన్ సాష్ ఇండియా ఈక్విటీ, వైట్ ఓక్ ఇండియా ఈక్విటీ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్టీ ప్క్రెవేట్ లిమిటెడ్ పిఎల్సి, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ స్మాల్‌క్యాప్ ఫండ్ వంటి ప్రముఖ సంస్థలు ఈ క్విప్‌లో పెట్టుబడి చేశాయి. ఈ నిధులను ఫార్మా, ఫుడ్, ఎఫ్ఎంసిజి, కాస్మెటిక్స్, ఒటిసి విభాగాల్లో ఇంజేక్షన్ బ్లో మౌల్డింగ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు ఖర్చు చేయునున్నట్లు మోల్డ్‌టెక్ సిఎండి జె లక్ష్మణ రావు తెలిపారు.