Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తల్లిదండ్రుల పెంపకం విధానాల్లో మార్పులు వచ్చాయి. తమ చిన్నారులకు సేంద్రీయ ప్రత్యామ్నాయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న మిలీనియల్ తల్లిదండ్రుల అవసరాలూ అలాగే ఉన్నాయి. ఈ మార్పు నుంచి ప్రేరణ పొందిన హగ్గీస్ - కింబర్లీ-క్లార్క్ ఐకానిక్ బ్రాండ్, హగ్గీస్ ® నేచర్ కేర్‌లో కీలకమైన అంశంగా రూపొందించిన ఆర్గానిక్ కాటన్ సహజమైన మంచితనాన్ని తెలియజేస్తూ, వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు తన కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు వెన్నుదన్నుగా ఉండాలనే తన తత్వానికి అనుగుణంగా, బ్రాండ్ తమ చిన్నారికి వారు చేసుకుంటున్న ఎంపికలపై వారి విశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారికి జ్ఞానంతో మరింత సాధికారత కల్పించే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ఆర్గానిక్ కాటన్ సమర్థత కలిగిన తన లక్షణాలతో, శిశువు సున్నితమైన చర్మాన్ని రక్షించేందుకు హగ్గీస్® నేచర్ కేర్ తన ప్రీమియం డైపర్ ప్యాంట్‌ను రూపొందించింది. న్యూట్రల్ పీహెచ్ లైనర్, 12 గంటలు తేమను పీల్చుకునే, తేమ సూచిక వంటి హానికరమైన ఉత్పత్తులు, అలాగే పారాబెన్లు, క్లోరిన్ లేదా రబ్బరు పాలు వంటివి లేకపోవడం, శిశువును రాత్రంతా సౌకర్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇటీవలి ఈ ఆఫర్ తల్లిదండ్రులకు సరైన పరిష్కారాన్ని అందిస్తుండడంతో తమ చిన్నారికి ఉత్తమమైన, సున్నితమైన సంరక్షణను అందించాలని కోరుకుంటున్నారు.
ఈ క్యాంపెయిన్ గురించి కింబర్లీ - క్లార్క్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ సాక్షి వర్మ మీనన్ మాట్లాడుతూ, ‘‘ఒక బ్రాండ్‌గా, వృద్ధి చెందుతున్న మా వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మా వ్యూహాలను జారీ చేస్తూ, మేము ఎల్లప్పుడూ విశ్వసనీయ పేరెంట్‌హుడ్ భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాము. ఈ క్యాంపెయిన్ ద్వారా కొత్తగా తల్లిదండ్రులుగా మారిన వారు హగ్గీస్ ® నేచర్ కేర్‌ను ఎంచుకోవడంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నారని భరోసా ఇచ్చేందుకు మా వంతుగా మరో ప్రయత్నం చేస్తున్నాము. ఇది సహజమైన పదార్ధం - ఆర్గానిక్ కాటన్, అదనపు చికాకు కలిగించే పదార్థాలు లేకుండా సున్నితమైన రక్షణ అందించేలా రూపొందించాము. శిశువులకు అత్యంత సౌకర్యాన్ని అందించేందుకు, కొత్తగా తల్లిదండ్రులుగా మారిన వారికి షరతులు లేని మద్దతును అందించాలన్న మా నిబద్ధతతో, మేము మా ఇన్నోవేషన్ వ్యాగన్‌ను శిశువు సంరక్షణలో ముందంజలో ఉంచేలా కొనసాగిస్తున్నాము. ఈ క్యాంపెయిన్‌లో మా ఉత్పత్తి వేరియంట్లలో నంబర్ ఒన్ ప్రాధాన్యతగా నిలిచిన మెరుగైన సంరక్షణను సాధించాలనే కంపెనీ ఉద్దేశాన్ని పునరుద్ఘాటిస్తుంది’’ అని వివరించారు.
‘‘ఇన్నోవేషన్-ఫస్ట్ మైండ్‌సెట్‌తో, హగ్గీస్ ఎల్లప్పుడూ వినియోగదారుల జీవితాల్లో సానుకూలమైన మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వాటిని ఎంపికలతోనే కాకుండా జ్ఞానంతోనూ సాధికారత కల్పిస్తుండగా, ఈ క్యాంపెయిన్ అందుకు భిన్నంగా ఏమీ లేదు. స్పృహతో కూడిన పేరెంటింగ్ ప్రధాన దశకు చేరుకోవడంతో, సేంద్రీయ పత్తి శక్తిని బ్రాండ్ తన తాజా ఆఫర్ హగ్గీస్ నేచర్ కేర్‌లో ముఖ్యమైన భాగంగా ప్రదర్శిస్తూ, మార్కెట్‌ప్లేస్‌ను నింపుతున్న ఉత్పత్తుల ప్రవాహం మధ్య సమాచారం, అవగాహనతో కూడిన నిర్ణయాన్ని తీసుకునేందుకు కొత్త తల్లిదండ్రులకు మరింత సహాయం చేస్తుంది’’ అని ఓగిల్వీ ఇండియా చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ సుఖేష్ నాయక్ వివరించారు.
టెక్-సావీ తల్లిదండ్రులతో కలిసి రూపొందించిన డిజిటల్ ఫిల్మ్‌కు దృఢమైన సోషల్ మీడియా ప్రచారం ద్వారా మద్దతు లభిస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రులు, శిశువు మధ్య సంబంధాల ద్వారా అనుబంధాన్ని బలోపేతం చేసే బ్రాండ్ తత్వాన్ని అనుకరిస్తూ, శిశువులకు ప్రకృతి నుంచి సున్నితమైన రక్షణను అందించే ఉత్పత్తి వాగ్దానాన్ని, నమ్మకాన్ని మరియు భరోసాను అందిస్తుంది.