Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సుప్రసిద్ధ హియరింగ్ కేర్ క్లీనిక్స్ గొలుసు కట్టు సంస్ధ ఆన్వీ హియరింగ్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, హైదరాబాద్‌లో మూడు అత్యాధునిక కేంద్రాలను తెరువడం ద్వారా ఇప్పుడు ముత్యాల నగరికి ప్రవేశించింది. ఈ కేంద్రాలు బంజారాహిల్స్, కాచిగూడా, సికింద్రాబాద్‌లలో ఉన్నాయి. ఈ అత్యాధునిక కేంద్రం ఆధునిక వినికిడి కేంద్రంగా ఉండటంతో పాటుగా పూర్తి స్ధాయిలో హియరింగ్ కేర్ పరిష్కారాలను అందిస్తాయి. హైదరాబాద్‌లోని ఆన్వీ కేంద్రం సమగ్రమైన ఆడియోలాజికల్ సేవలైనటువంటి ఆడియోమెట్రి, టింపనోమెట్రీతో పాటుగా హియరింగ్ ఎయిడ్ ట్రయల్, ఫిట్టింగ్, హియరింగ్ ఎయిడ్ ప్రోగ్రామింగ్, సర్వీసింగ్, విడిభాగాలు, యాక్ససరీలు మొదలైనవి లభిస్తాయి.
‘‘హైదరాబాద్ నగర ప్రజలకు శబ్ద నాణ్యత, కనెక్టివిటీలో క్వాంటమ్ లీప్‌ను పరిచయం చేయడానికి ఆసక్తిగా శివాంటోస్ ఉంది. దీనితో పాటుగా వ్యక్తిగత వినికిడి అనుభవంపై ఎక్కువ నియంత్రణ పొందేలా చేస్తుంది. మేము స్థిరంగా నూతన సాంకేతిక పరిష్కారాలను ఆవిష్కరించడంతో పాటుగా అత్యాధునిక డిజిటల్ ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాము. ఇవి అత్యున్నత నాణ్యత కలిగిన వినికిడి అనుభవాలను వినియోగదారులకు అందిస్తాయి. ఈ నూతన హియరింగ్ ఎయిడ్ పరిష్కారాలు ఆధునిక వినియోగదారుల డిమాండింగ్ షెడ్యూల్‌కు అనుగుణంగా ఉండటంతో పాటుగా తల్లిదండ్రులతో వారి అనుబంధం బలోపేతం అవుతుంది’’ అని అవినాష్ పవార్, సీఈవో, శివాంటోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నారు.
‘‘అన్ని వయసుల వినియోగదారుల డిమాండింగ్ అవసరాలను తీర్చేలా సృజనాత్మక హియరింగ్ పరిష్కారాలను అందించాలనే దిశగా వేసిన మరో ముందడుగు హైదరాబాద్‌లో మా కేంద్రాల ప్రారంభం. తమ ఖాతాదారులకు నాణ్యమైన ఎకౌస్టిక్ పరిష్కారాలను అందించడానికి ఆన్వీ హియరింగ్ సొల్యూషన్స్ కట్టుబడి ఉంది. ఆన్వీ వద్ద, అర్హత కలిగిన ఆడియోలాజిస్ట్లు లక్షణాలు, కారణాలు కనుగొనడంతో పాటుగా పరీక్షలు చేస్తూనే తగిన పరిష్కారాలనూ అందించున్నారు. వినికిడి లోపాన్ని తప్పనిసరిగా ముందుగా గుర్తించడంతో పాటుగా తక్షణమే తగిన పరిష్కారాలనూ అందించడం వల్ల అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు. ప్రపంచశ్రేణి వినికిడి పరిష్కారాలను , అమ్మకం తరువాత సేవలను మా వినియోగదారులకు అందించాలన్నది మా లక్ష్యం’’ అని విశాల్ షా, సీఈవో, ఆన్వీ హియరింగ్సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ అన్నారు.