Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న విదేశీ మారకం నిల్వలు పడిపోయాయి. డిసెంబర్ 17తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 160 మిలియన్ డాలర్లు తగ్గి 635.667 బిలియన్లకు పరిమితమైట్టు ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ఇంతక్రితం డిసెంబర్ 10తో ముగిసిన వారంలోనూ 77 మిలియన్ డాలర్లు తగ్గి 635.828 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో రికార్డ్ స్థాయిలో 642.453 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డిసెంబర్ 17తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్సీఏ) పడిపోవడంతో నిధులు తగ్గాయని ఆర్బీఐ పేర్కొంది. ఇదే వారంలో పసిడి రిజర్వులు 475 మిలియన్ డాలర్లు పెరిగి 39,183 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వద్ద యథాతథంగా 19,089 బిలియన్ డాలర్ల నిధులు ఉన్నాయని ఆర్బీఐ వెల్లడించింది.