Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో వాడిన వాహన అమ్మకాలు రెట్టింపు కానున్నాయని ఓ రిపోర్ట్ తెలిపింది. 2021 మార్చి నాటితో ముగిసిన ఏడాదిలో ఈ రీసేల్ వాహన అమ్మకాలు 40 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా ఆర్థిక సంవత్సరం 2025-26 నాటికి ఈ అమ్మకాలు 82 లక్షల యూనిట్లకు చేరొచ్చని గ్రాంట్ తోర్నోటన్ భారత్ శుక్రవారం ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ప్రతీ ఏడాది ఈ మార్కెట్ 14.8 శాతం పెరిగి 2030 నాటికి 70.8 బిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది. చిన్న పట్టణాలు, మెట్రోయేతర నగరాల్లో ఇంధన డిమాండ్, వాహనాలపై ఆసక్తి పెరగడంతో రీసేల్ అమ్మకాలు భారీ వృద్థిని నమోదు చేస్తున్నాయని పేర్కొంది.