Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కల్పించే విక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నియమితులైనట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ''రణవీర్‌ను మా ప్రచారకర్తగా నియమించుకోవడంతో ఆయనకు ఉన్న విస్తతమైన ప్రజాబాహుళ్యంతో అనుబంధం పెంచుకోవడానికి వీలుంది. ఈ భాగస్వామ్యం ద్వారా విక్స్ కాఫ్ డ్రాప్స్ వినియోగదారులతో మరింత బలమైన బంధం ఏర్పరుచుకోవచ్చని భావిస్తున్నాం.'' ప్రోక్టర్ అండ్ గాంబుల్ పర్సనల్ హెల్త్‌కేర్ విభాగం సీనియర్ డైరెక్టర్, కేటగిరీ హెడ్ సాహిల్ సేథి పేర్కొన్నారు.