Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్పోయిన యూనికార్న్ హోదా
న్యూఢిల్లీ : డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీయంకు చెందిన ఈ-కామర్స్ విభాగం 'పేటీఎం మాల్' అత్యంత కీలకమైన యూనికార్న్ హోదాను కోల్పోయింది. హురూన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తాజాగా ప్రకటించిన యూనికార్న్ జాబితాలో 'పేటీఎం మాల్' స్థానం లభించలేదు. 100 కోట్ల డాలర్లు లేదా రూ.7500 కోట్లు పైబడిన విలువ గల స్టార్టప్ కంపెనీలకు ఈ హోదాను ఇస్తారు. కాగా.. తాజా రిపోర్ట్‌లో పేటీఎం మాల్ విలువ 100 కోట్ల డాలర్ల కిందకి పడిపోయినట్లు స్పష్టమవుతోంది. 2016లో పేటియం మాల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి 2019లో ఈ సంస్థ విలువ 2.86 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లు)కు చేరుకుంది. గతేడాది ఏకంగా దాదాపు రూ.22.5 వేల కోట్లుగా ఉంది. ప్రస్తుత ఏడాదిలో యూనికార్న్ హోదా కోల్పోవడంతో పేటీఎంకు తీవ్ర చేదు అనుభవాన్ని మిగిల్చినట్లయింది. హురున్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. యూనికార్న్‌ల సంఖ్యలో బ్రిటన్ను పక్కకు నెట్టి భారత్ మూడో స్థానంలోకి వచ్చింది. ఒకే ఏడాదిలో 33 యునికార్న్‌లు కొత్తగా వచ్చి చేరడంతో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరింది. అమెరికా, చైనా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.