Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యుల పరిశోధన
హైదరాబాద్ : రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యుల పరిశోధన యూరోపియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ న్యూరాలజీలో ప్రచురితం అయినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ వివరాలు.. తమ వైద్యులు చేసిన ప్రత్యేక అధ్యయనంలో గర్బవతులు తగిన రీతిలో పౌష్టికాహారం తీసుకుంటే ప్రాణాంతకమైన థయామిన్ లోప నివారణకు తోడ్పడుతుందని వెల్లడయ్యిందని పేర్కొంది. ''శిశువులలో ఎన్సిఫాలోపతితో థయామిన్ ప్రతిస్పందన, ప్రాణాంతక, పల్మనరీ హైపర్టెన్సివ్ పరిస్థితి'' అనే శీర్షికన ఈ ఈ అధ్యయనం ప్రచురితం అయినట్టు వెల్లడించింది. సికింద్రాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్‌లోని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనంకి, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ ప్రీతమ్ కుమార్ రెడ్డి మార్గనిర్దేశంలో డాక్టర్ సుర్యకాంతి సి ఈ అధ్యయనం చేశారని వెల్లడించింది. తల్లులు పౌష్టికాహారంపై శ్రద్ద చూపడం ద్వారా శిశువులను ఈ ప్రాణాంతక స్థితి బారిన పడకుండా కాపాడవచ్చని తేలింది.