Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిప్స్ కొరతతో ధరల పెంపు
న్యూఢిల్లీ : కొత్త ఏడాది నుంచి విద్యుత్ వాహన ధరలు పెరిగే సంకేతాలు కనబడుతున్నాయి. కరోనా, ఒమిక్రాన్ భయాలతో ఆయా పరిశ్రమల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కరోనా రెండు దశల్లోనూ వాహన, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సెమీకండక్టర్లు (చిప్స్) కొరత భారీగా పెరగడంతో ఉత్పత్తి దెబ్బతింది. ఈ ప్రభావం భారత వాహన పరిశ్రమపైన పడింది. దీన్ని అనువుగా తీసుకుని ఆయా కంపెనీలు వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నా యి. మరోసారి వచ్చే ఏడాది నుంచి వాహనాల ధరలు భారీగా పెంచే యోచనలో ఉన్నాయని తెలుస్తోంది. చిప్స్ కొరతతో పాటు బ్యాటరీల తయారీ పెను సవాలుగా మారడంతో విద్యుత్ వాహన ధరలు కూడా పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిశ్రమ ఇప్పటికే లిథియం, అయాన్ బ్యాటరీల కొరతను ఎదుర్కొంటున్నాయి. బ్యాటరీల తయారీలో వాడే ప్రధాన లోహాలైన లిథియం, నికెల్, కోబాల్ట్ ధరలు భారీగా పెరగటంతో ధరల పెంపు అనివార్యమని అంచనా వేస్తున్నారు.