Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వినికిడి సమస్యల పరిష్కార క్లీనిక్స్ గొలుసు కట్టు సంస్ధ ఆన్వీ హియరింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్‌లో సిగ్నియా భాగస్వామ్యంతో మూడు అత్యాధునిక కేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. బంజారాహిల్స్, కాచిగూడా, సికింద్రాబాద్‌లలో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ అత్యాధునిక కేంద్రాలు ఆధునిక వినికిడి కేంద్రంగా ఉండటంతో పాటుగా పూర్తి స్ధాయిలో హియరింగ్ కేర్ పరిష్కారాలను అందిస్తాయని ఆన్వీ హియరింగ్సొల్యూషన్స్ సిఇఒ విశాల్ షా పేర్కొన్నారు. దేశంలో ఆరు శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారని అంచనా.