Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : టాటా ఇండస్ట్రీస్‌కు చెందిన టాటా క్లాస్ ఎడ్జ్ (టీసీఈ) తమ మార్కెటింగ్ ప్రచారం 'పడ్నే కా సహీ తరీఖా`ను టాటా స్టడీ చుట్టూ విడుదల చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. 2021 సంవత్సరారంభంలో టాటా స్టడీని పాఠశాల అనంతర అభ్యాస యాప్‌గా పరిచయం చేసింది. దీనిని అభ్యాస శాస్త్ర మౌలిక సూత్రాల ఆధారంగా తీర్చిదిద్దారు. ఈ మల్టీ డిసిప్లీనరీ విధానంలో న్యూరో సైన్స్, సైకాలజీ, కాగ్నిటివ్ సైన్స్ నుంచి అధ్యయనాలను మిళితం చేశారు.
మొదటిసారిగా పరిచయం చేసిన టాటా స్టడీను విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు కూడా అమితంగా అభినందించారు. దీని డిజైన్, కంటెంట్, స్వీకరించతగిన స్టడీ ప్లానర్ కారణంగా వీరి ప్రశంసలను ఈయాప్ అందుకుంది. ఈ యాప్‌లోని స్టడీ ప్లానర్ విద్యార్థులకు అభ్యాసలక్ష్యాలను వెల్లడించడంతో పాటుగా తమ సౌకర్యంకు తగినట్లుగా తమ అభ్యాసం చేసేలా తీర్చిదిద్దారు. ఈ తొలి విజయంతో టాటా స్టడీ ఇప్పుడు తమ అవగాహన మరియు చేరికను మల్టీ ఛానల్ మార్కెటింగ్ ప్రచారం ద్వారా ప్రారంభించింది.
నూతన ప్రచారం 'పడ్నే కా సహీ తరీఖా ` ప్రధానంగా సరైన అభ్యాసంపై దృష్టిసారించింది. సరైన అభ్యాసం అంటే, ఒకరు తమ అభ్యాసాన్ని సమర్థవంతంగా ప్రణాళిక చేయడంతో పాటుగా స్థిరమైన పునఃశ్చరణ మరియు ప్రాక్టీస్‌తో అనుసరించేలా చేస్తుంది. ఈ ప్రచారాన్ని తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకోసం ఏ విధమైన చర్యలను తీసుకుంటున్నారనే అంశాల ఆధారంగా ప్రారంభించారు. తమ చిన్నారుల విజయానికి భరోసా అందించేందుకు తల్లిదండ్రులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దానితో పాటుగా పిల్లలపై కూడా ఒత్తిడి పెంచుతున్నారు. అసలైన విజయం అనేది సమర్థవంతమైన ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది తప్ప ఒత్తిడి చేయడం వల్ల కాదు.
ఈ ఆలోచనతోనే 'ప్రెజర్ నహీ ప్లాన్` అనే భావన పుట్టింది. వరుసగా పలు చిత్రాల ద్వారా చేసే ప్రచారంతో తమ అభ్యాసానికి సంబంధించి ప్రణాళిక ముఖ్యమని ప్రచారం చేస్తున్నారు. ప్రణాళికతో మాత్రమే చిన్నారులు అత్యుత్తమంగా సిద్ధంకావడంతో పాటుగా ఒత్తిడి తగ్గించుకోవడం, తమ పరీక్షలలో చక్కటి ప్రదర్శన కనబరచడం చేయగలరు. ఈ ప్రచారాన్ని ముల్లెన్ ఇండియా నేపథ్యీకరించి, అమలు చేసింది.
ముల్లెన్ లింటాస్తో భాగస్వామ్యం గురించి టాటా క్లాస్ ఎడ్జ్ బీ2సీ చీఫ్ సచిన్ తోర్నీ మాట్లాడుతూ 'అభ్యాస శాస్త్రపు మౌలిక సూత్రాలపై ఆధారపడి రూపొందించిన విద్యా ఉత్పత్తి టాటా స్టడీ. చిన్నారులు తమ అభ్యాసం ప్రణాళిక చేసుకోవడంతో పాటుగా అర్థం చేసుకోవడం కోసం చదువాల్సిందిగా తెలుపుతున్నాం. అందువల్ల, వారు తమ అభ్యాసాన్ని వాస్తవ జీవితంలో కూడా వినియోగించుకోగలరు. ఎలాంటి కార్యక్రమానికి అయినా ప్రణాళిక తో ఒత్తిడి తగ్గుతుంది. విద్య పరంగా కూడా ఇది కనిపిస్తుంది. టాటా స్టడీ ద్వారా, మేము విద్యార్థులలో చక్కటి అభ్యాస అలవాట్లను పెంపొందించాలనుకుంటున్నాము. ఒకసారి చిన్నారులకు ఎలా చదవాలో తెలిస్తే, అది వారి జీవితాంతం నిలిచి ఉంటుంది. ఎడ్టెక్ విభాగంలో లింటాస్ విజ్ఞానం మమ్మల్ని ఆకట్టుకుంది. అలాగే మా విలువ ప్రతిపాదనను ఖచ్చితంగా అర్ధం చేసుకోవడంలో వారి సృజనాత్మకత అద్భుతం. టాటా స్టడీకి బ్రాండ్ భాగస్వామిగా లింటాస్ను స్వాగతిస్తున్నాము` అని అన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి అజాజుల్ హక్ మరియు గరిమా ఖండేల్వాల్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్స్, ముల్లెన్ లింటాస్ మాట్లాడుతూ 'ఈ విభాగంలో ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి. అందువల్ల , తల్లిదండ్రులతో పాటుగా చిన్నారులకు కూడా సంబంధితంగా ఉండేలా మా సృజన చూపాలనుకున్నాము. తెలియకుండానే తల్లిదండ్రులు తమ చిన్నారులపై ఒత్తిడి పెంచుతున్నారు. మరీ ముఖ్యంగా పరీక్షలు ఉన్న సమయంలో ! కావున ఈ ఆలోచన ప్రెషర్ నహీ, ప్లాన్, ఖచ్చితంగా టాటా స్డడీకి వైవిధ్యంగా నిలుస్తుంది్` అని అన్నారు.