Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 2021లో అత్యుత్తమ డిస్నీ చలనచిత్రం ఎన్కాంటో కోసం మ్యాజికల్ సౌండ్‌ట్రాక్‌ను రూపొందించడం గురించి దర్శకుడు జారెడ్ బుష్ మాట్లాడారు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
దర్శకుడు జారెడ్ బుష్ దీనిపై మాట్లాడుతూ, 'ఆ వారసత్వాన్ని గౌరవించడం మరియు గొప్ప పని చేయడానికి మాపై చాలా ఒత్తిడి ఉంది. మనం ఎదుగుతున్నప్పుడు చూసిన సినిమాలు మనల్ని ఎలా అలరించాయో, ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము. ఆ కల సాధ్యపడేందుకు జట్టులో మిరాండా భాగం. నేను మోనాలో పని చేసిన అదృష్టవంతుల్లో ఒకడిని మరియు అది ఒక అద్భుతమైన అనుభవం. సంగీతం కథలు చెప్పడానికి ఎలా సహాయపడుతుందనే అంశాన్ని దాని నుంచే నేను చాలా నేర్చుకున్నాను. మొదటి నుంచి ఎన్కాంటో`లో భాగం అయ్యేందుకు ఉత్సాహంగా ఉన్నాను` అని పేర్కొన్నారు.
ది ఎన్కాంటోలో మాడ్రిగల్లు మిమ్మల్ని మనోహరమైన పట్టణం ఎన్కాంటోకు తీసుకు వెళుతున్నప్పుడు మిమ్మల్ని మాయచేస్తారు. ఇంగ్లీషుతో పాటు హిందీ, తమిళం, తెలుగులో డిస్నీం హాట్‌స్టార్‌లో ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎన్కాంటో పట్టణానికి ఇంద్రజాలంతో కూడిన ప్రమాదం ఆసన్నమయ్యేంత వరకు దాని చుట్టూ ఉన్న అనేక అవకాశాలతో మిమ్మల్ని మాయజెయ్యనివ్వండి. దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై చక్కని కథనంతో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత, ఎన్కాంటోకు సంబంధించిన మనోహరమైన కథను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం మరియు తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. డిసెంబర్ 24 నుంచి డిస్నీం హాట్‌స్టార్‌లో ప్రారంభమైంది. మాడ్రిగల్ల జీవితాల గురించి మరియు ఎన్కాంటో పట్టణాన్ని మిరాబెల్ ఎలా కాపాడుతుందో తెలుసుకునే ప్రయాణంలో భాగం అవ్వండి.
ప్రతిభావంతులైన మరియు నైపుణ్యం కలిగిన తారాగణం ఎన్కాంటోలోని ప్రాథమిక పాత్రలకు గాత్రదానం చేశారు. మాడ్రిగల్లోని మిరాబెల్కు నటి స్టెఫానీ బీట్రిజ్, బ్రూనో మాడ్రిగల్కు టోనీ అవార్డ్-విజేత నటుడు జాన్ లెగ్యుజామో సహనటులు, జేన్ పాత్రకు డయాన్ గెరెరో మరియు అబులా అల్మా మాడ్రిగల్ పాత్రకు మరియా సిసిలియా బొటెరో స్వరాలను అందించారు.