Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వేగంగా పెరుగుతున్న సైబర్ మరియు ఆర్థిక మోసాల కేసుల నుంచి భారతదేశాన్ని రక్షించే క్రమంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 2021లో ఓ విప్లవాత్మక నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్ర బ్యాంకు తీసుకువచ్చిన ఈ నూతన నిబంధధనలతో చెల్లింపుల నెట్వర్క్స్తో పాటుగా ఇష్యూయర్ బ్యాంకులు కార్డు టోకనైజేషన్ సేవలను టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లు(టీఎస్పీలు)గా ఈ-కామర్స్ వ్యాపారులు మరియు పేమెంట్స్ యాగ్రిగేటర్లకు 01 జనవరి 2022 నుంచి జారీ చేసేందుకు అనుమతించింది. చెల్లింపుల నెట్వర్క్ అందించేటటువంటి ఉపకరణ ఆధారిత టోకనైజేషన్ సేవలకు విస్తరణగా ఈ అనుమతి ఉంటుంది.
టోకనైజేషన్ అనేది కార్డు నెంబర్లను టోకెన్‌తో భర్తీ చేసే యంత్రాంగం, అంటే వర్ట్యువల్ నెంబర్‌తో భర్తీ చేస్తుంది. ఇది వ్యాపారికి నిర్ధిష్టంగా ఉంటుంది. ఓ వినియోగదారుడు మర్చంట్ యాప్ లేదా వెబ్సైట్లో లాగిన్ అయినప్పుడు అక్కడ కార్డు వివరాలు నమోదై ఉండటంతో పాటుగా కార్డులో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనబడతాయి. కానీ దీని వెనుక మాత్రం, టీఎస్పీలు ఈ కార్డు నెంబర్‌ను టోకెన్‌తో భర్తీ చేస్తాయి. తద్వారా ఈ విలువ గొలుసుకట్టులో ఇష్యూయర్ బ్యాంకులు మరియు నెట్వర్క్స్ మినహా ఎక్కడా కార్డు వివరాలు నమోదు కాలేదనే భరోసాను అందిస్తాయి. ఈ విధానంతో కార్డు ఆధారిత లావాదేవీలు సురక్షితంగా ఉండటంతో పాటుగా మరింత ఆధారపడతగిన రీతిలో ఉంటాయి. ఈ టోకనైజేషన్ ప్రక్రియ అనేది వినియోగదారుల సమ్మతి ఆధారంగా ఉండటంతో పాటుగా అదనపు ఫ్యాక్టర్ అథెంటికేషన్ ద్వారా ధృవీకరిస్తారు.
తమ కార్డు వివరాలను బహుళ ఈ-కామర్స్ వ్యాపారుల వ్యాప్తంగా నిల్వ చేసిన వినియోగదారులకు వారి కార్డు వివరాలు టోకెన్ రూపంలో 01 జనవరి 2022 కు ముందుగా లావాదేవీలు జరిపిన ఎడల మారతాయి. ఈ గడువు తేదీ ముగిసిన తరువాత, వినియోగదారులు ఒకసారి తమ వివరాలను టొకెన్స్గా మార్చుకోవడం కోసం నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత జరిపే అన్ని లావాదేవీల కోసం, వినియోగదారులు సింగిల్ క్లిక్ చెకవుట్ అనుభవాలను వారు ఏ విధంగా అయితే నేడు పొందుతున్నారో అలాగే పొందవచ్చు. ఈ-కామర్స్ యాప్‌లు లేదా వెబ్‌సైట్స్ వద్ద ఎవరైతే తమ కార్డుమొదటి సారి వినియోగిస్తున్నారో వారు చెకవుట్ ప్రక్రియలో ఓటీపీని అదనపు అథెంటికేషన్ ఫ్యాక్టర్‌గా వినియోగించాల్సి ఉంది.