Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సోనాలికా ట్రాక్టర్స్ కొత్తగా అత్యాధునికమైన టైగర్ డిఐ 75.4 డబ్ల్యుడి ట్రాక్టర్లను ఆవిష్కరించింది. అత్యున్నత కామన్ రైల్ డిజిటల్ సిస్టమ్ (సిఆర్డిఎస్) టెక్నలాజీతో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీని ధరను రూ.11 -11.2 లక్షలుగా నిర్ణయించింది. ఇది 65 హెచ్పి శక్తిని, 55 హెచ్పి ట్రాక్టర్ ఇంధన సామర్థ్యంతో పని చేస్తుందని పేర్కొంది. యూరోపియన్, అమెరికన్ ఉద్గార ప్రమాణాలు సిఆర్డిఐ సాంకేతికతతో భారత్లో దీన్ని తొలి సారి ఆవిష్కరించినట్లు తెలిపింది.