Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని ఆర్బిఎల్ బ్యాంక్‌లో సంక్షోభం నెలకొందన్న రిపోర్ట్లు సోమవారం ఆ బ్యాంక్ షేర్లను భారీ పతనానికి గురి చేశాయి. ఆ బ్యాంక్ ఎండి, సిఇఒ విశ్వవిర్ అహుజా అనుహ్యాంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తాత్కాలిక ఎండి, సిఇఒగా రాజీవ్ అహుజాను నియమించింది. ఈ పరిణామాలతో ఆర్బిఎల్ బ్యాంక్‌లోని క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని సంకేతాలు వచ్చాయి. ఈ బ్యాంకు మేనేజ్మెంట్లో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకోవడంతో, బ్రోకరేజ్ సంస్థలు రేటింగ్‌ను డౌన్ గ్రేడ్ చేశాయి. ఈ పరిణామాలు ఆ బ్యాంక్ షేర్‌ను కుప్పకూలేలా చేశాయి. బిఎస్ఇ సెన్సెక్స్‌లో ఓ దశలో 20 శాతం క్షీణించి రూ.130.20కు పడిపోయింది. 18.10 శాతం పతనమై రూ.141.60 వద్ద ముగిసింది. కాగా ఈ బ్యాంక్ నిర్వహణ సంతృప్తికరంగానే ఉందని ఆర్బిఐ పేర్కొంది.