Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని కార్మిచెల్ గని నుంచి బొగ్గు ఎగుమతులను ప్రారంభించనున్నట్లు అదానీ గ్రూపు వెల్లడించింది. ఇక్కడి నార్త్ క్వీన్స్లాండ్ ఎక్స్పోర్ట్ టర్మినల్ నుంచి ఎగుమతులకు సిద్దం అయినట్లు అదానీ గ్రూపునకు చెందిన ఆస్ట్రేలియన్ మైనింగ్ కంపెనీ తెలిపింది. ఈ వారంలోనే ఎగుమతులు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. అదానీ గ్రూపు ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని అక్కడి ప్రజలు, ప్రతినిధులు తీవ్ర ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.