Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ (JLL), హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ అశోకా బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ASBL)కు రూ.235 కోట్లకు 10 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ విక్రయాన్ని పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఏఎస్బీఎల్ ఈ డీల్‌కు పెద్ద బిడ్డర్‌గా నిలిచింది.
హైదరాబాదుకు వాయువ్యంలోని కూకట్పల్లి బిజీ బిజినెస్ హబ్‌లో ఈ భూమి ఉంది. ఇది అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్ సముదాయానికి, నగరంలోని హాట్స్పాట్లకు అద్భుతమైన అనుసంధానానికి కూడా ప్రసిద్ది చెందింది. ఈ భూమి దేశంలోని పెద్ద కార్పొరేట్ సంస్థలకు చెందినది. డీల్ కోసం విక్రేత ద్వారా ప్రత్యేక లావాదేవీ భాగస్వామిగా జేఎల్ఎల్ నియమించబడింది.
‘‘జేఎల్ఎల్కు ఉన్న బలమైన మార్కెట్ మేధస్సు, బలమైన సంబంధాలతో రికార్డు సమయంలో ఈ డీల్‌ను విజయవంతంగా పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. హైదరాబాద్‌కు అనుకూలమైన మార్కెట్‌ను కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ రెండింటికీ బలమైన డిమాండ్ ఉందని ఈ డీల్ రుజువు చేస్తుంది’’ అని జేఎల్ఎల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్ పేర్కొన్నారు. ‘‘మొత్తం లావాదేవీ ప్రక్రియ చాలా నిశితంగా మరియు భూ యజమానుల వ్యాపార సిద్ధాంతం మరియు విలువ వ్యవస్థలకు అనుగుణంగా అత్యంత పారదర్శకతతో కొనసాగింది’’ అని ఆయన వివరించారు. ఆయన మాట్లాడుతూ, ‘‘2021 క్యూ3లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికవరీకి మద్దతు ఇవ్వడంలో కొనుగోలుదారుల విశ్వాసం పునరుద్ధరించబడడం కీలకంగా ఉండగా, ఇది గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఆరోగ్యకరమైన విక్రయాలు, లాంచ్‌లను నమోదు చేసింది. ఈ సంఖ్యలు కొవిడ్‌కు ముందస్తు సమయానికి తగినట్లు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
‘‘మేము జూన్ 2025 నాటికి ప్రీమియం రెసిడెన్షియల్ డెవలప్మెంట్, గ్రేడ్ ఏ కమర్షియల్ స్పేస్‌ని కలిపి మిశ్రమ-వినియోగ అభివృద్ధిని విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ విలువను పరిగణనలోకి తీసుకుని, ఈ మిశ్రమ వినియోగ సముదాయాన్ని అభివృద్ధి చేసేందుకు మేము మరో రూ.250 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రాజెక్టు విలువను రూ.600 కోట్లకు తీసుకు వెళ్లాలని యోచిస్తున్నాము’’ అని ఏఎస్బీఎల్ సీఈఓ అజితేష్ కొరుపోలు తెలిపారు. ‘‘మేము ఈ ప్రాజెక్ట్ విషయంలో మూడు ప్రధాన కారణాల వల్ల సంతోషిస్తున్నాము. కంపెనీ దృక్కోణం నుంచి ఇది హైదరాబాద్‌కు అన్ని వైపులా మా ఉనికిని వైవిధ్యపరుస్తుంది. మేము ఇప్పటికే నైరుతి, పశ్చిమంలో ఉన్నాము, కూకట్‌పల్లిలో ఏఎస్బీఎల్ హైదరాబాద్‌కు వాయువ్యంగా విస్తరించేలా చేసింది. రెండవది, ఇది వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో మా మొదటి వెంచర్. మూడవది, ఇటీవల ప్రారంభించిన ఫ్లైఓవర్లు, మెట్రో రైలు, ఇతర అన్ని రకాల రవాణా సదుపాయాలతో కూకట్పల్లి చక్కని అనుసంధానాన్ని కలిగి ఉండడం ఈ భూమిని లాభదాయకమైన పెట్టుబడి అవకాశంగా మార్చింది’’ అని వివరించారు.
ఏఎస్బీఎల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్త-తరపు రియల్ ఎస్టేట్ కంపెనీ. గత ఐదేళ్లుగా, ఏఎస్బిఎల్ నిర్మాణ సాంకేతికత రంగంలో సముచిత స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం, సంస్థకు హైదరాబాద్ వ్యాప్తంగా 5 మిలియన్ చ. అడుగుల రెసిడెన్షియల్ బిల్ట్-అప్ స్థలాన్ని కలిగి ఉంది.
సరసమైన సినర్జీలు, గృహయజమానుల వృద్ధి చెందుతున్న అవసరాల కారణంగా ఆల్-టైమ్ తక్కువ కుదువ రేట్లు, వివిధ రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ మినహాయింపులు మరియు నిలకడగా ఉన్న ధరలు హౌసింగ్ డిమాండ్ రికవరీని పెంచుతున్నాయి. కాగా, 2020 క్యూ3లో 34% సీక్వెన్షియల్ వృద్ధితో పోలిస్తే 2021 క్యూ3లో అమ్మకాల పరిమాణం వరుసగా 65% వృద్ధి చెందింది. మొదటి ఏడు నగరాలు కొత్త లాంచ్‌లలో 21% వరుస వృద్ధిని సాధించాయి. 2021 క్యూ3లో 32,863 యూనిట్లు వచ్చాయి. హైదరాబాద్‌లో అత్యధిక కొత్త లాంచ్‌లు జరిగాయి. అలాగే 2021 క్యూ3లో జరిగిన మొత్తం కొత్త లాంచ్‌లలో హైదరాబాద్ 28% వాటాను కలిగి ఉంది. ఇంటి కొనుగోలు స్థోమత సూచిక (JLL HPAI 2021) నగరం నివాస ప్రాపర్టీకి సరసమైన మార్కెట్‌గా కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది స్థోమత సూచికలో హైదరాబాద్ 200 మార్కును అధిగమించగలదని అంచనా వేయబడింది. హైదరాబాద్, కోల్‌కతా మార్కెట్లలో సగటు ఆదాయాన్ని ఆర్జించే కుటుంబానికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రెండు 1,000 చదరపు అడుగుల అపార్ట్మెంట్లపై (లేదా 2,000 చదరపు అడుగుల అపార్ట్మెంట్) హోమ్ లోన్‌కు అర్హత పొందేందుకు తగినంత ఆదాయం ఉందని ఇండెక్స్ సూచిస్తుంది.