Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలోని అతి పెద్ద బిస్కెట్ బ్రాండ్ బ్రిటానియా గుడ్ డే నేడు కొత్త గుర్తును ఆవిష్కరించింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని విశ్వసనీయమైన ఫుడ్ బ్రాండ్‌గా బ్రిటానియా గుడ్ డే నగరం మరియు గ్రామీణ భారతదేశంలో రెండు చోట్లా లోతైన వ్యాప్తిని కలిగి ఉంది. బ్రిటానియా గుడ్ డే భారతదేశంలో 1987లో విడుదల కాగా, భారతదేశంలో కుకీ్ణ విభాగాన్ని సృష్టించింది మరియు మొట్టమొదటిసారిగా డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ భారతదేశంలోని ఇండ్లలో అందుబాటులో ఉండేలా చేసింది. సదా సంతోషాన్ని విస్తరించే ఈ బ్రాండ్ నేడు భారతదేశపు శ్రీమంతపు మరియు వైవిధ్యమయమైన నవ్వు దాని మార్పునకు స్ఫూర్తి నింపిందని పేర్కొంది. ఈ సరికొత్త గుడ్ డే బిస్కట్టు డిజైన్ పలు రకాల నవ్వులను కలిగి ఉండగా డింపుల్ నవ్వు నుంచి పెద్ద నవ్వు వరకు డబుల్ డింపుల్ నవ్వును కలిగి ఉంది. దీనితో వినియోగదారులు ప్రతి బ్రిటానియా గుడ్ డేలో 'కయీ స్టైల్స్ నయీ స్టైల్స్` ను ఆస్వాదించవచ్చు!
కొత్త ప్యాక్‌లతో 8ఎ హై డెన్సిటి విడుదలకు సిద్ధం కాగా, కొత్త ప్యాక్‌లు భారతదేశ వ్యాప్తంగా 4.8 మిలియన్ల పైచిలుకు కొత్త రిటెయిల్ స్టోర్లకు చేరుకున్నాయి. ఈ బ్రాండ్ తన కొత్త గుర్తును ప్రకటించేందుకు అత్యంత భారీ మాధ్యమ ప్రణాళికను కలిగి ఉంది. ఈ కమ్యూనికేషన్‌ను ముద్రణ, టీవీ, సామాజిక మాధ్యమం మరియు ఔట్డోర్లలో ప్రకటించనున్నారు. ఈ వినూత్న తరహా రియాలిటీ అనుభవాన్ని వినియోగదారులు ఈ అభియాన్‌లో అవిభాజ్య అంగంగా ఉండేలా భావించేలా రూపొందించారు. సరికొత్త ప్యాకేజింగ్ ప్రతి ఎస్కెయు ప్యాక్‌పై వివిధ నవ్వుల ప్యాక్ డిజైన్ కలిగి ఉంటూ, వైవిధ్యమయమైన నవ్వులను లైవ్లీగా తీసుకు వస్తుంది.
బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రి మాట్లాడుతూ, 'మనం నిత్యం చేసే కమ్యూనికేషన్లలో ప్రజలకు దూరం అవుతున్న సమయంలో, ఆ రోజు ఎలా ఉన్నప్పటికీ ప్రతి సారి గుడ్ డే అంటాము. ఈ సార్వత్రిక అభిప్రాయం గుడ్ డేలో మా పనికి స్ఫూర్తి తీసుకు వచ్చింది. గుడ్ డే ప్రముఖ ఉద్దేశం సంతోషాన్ని విస్తరించడం. నేడు ఈ బ్రాండ్ ఇప్పటి వరకు అత్యంత పెద్ద మేకోవర్‌ను కలిగి ఉండగా, భారతదేశంలోని వైవిధ్యమయమైన నవ్వులను ప్రతిబింబిస్తుంది. దేశ వ్యాప్తంగా గుడ్ డే ప్రతి ప్యాక్ కూడా బిస్కెట్ డిజైన్‌లో భాగంగా పలు నవ్వులను కలిగి ఉంటుంది. ఇది గుడ్ డే నిష్ఠావంతమైన మరియు పెద్ద వినియోగదారులకు మేము ఇచ్చే అత్యంత పెద్ద గౌరవం` అని పేర్కొన్నారు.
విడుదలైన కొత్త ప్యాక్ నాలుగు రకాలైన బటర్, క్యాజూ, క్యాజూ ఆల్మండ్ మరియు పిస్తా బాదమ్లలో లభిస్తుంది. రూ.5 నుంచి ప్రారంభించి కొత్త గుడ్ డే ప్యాక్‌లు ఇప్పటికే అన్ని మార్కెట్లలో స్టాండర్డ్ ధరలు మరియు వివిధ ప్యాక్‌లలో లభిస్తాయి.