Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : అమెరికాలో ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరించడంతో న్యూయార్క్ నగరంలోని ఏడు ఆపిల్ రిటైల్ స్టోర్లను మూసివేస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ నెల ప్రారంభంలో అమెరికాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో పాటు ఆపిల్ స్టోర్ల ఉద్యోగులకు కరోనా సోకడంతో ఈ పరిస్థితి నెలకొంది. అమెరికా, కెనడా దేశాల్లో 10 ఆపిల్ స్టోర్లను మూసివేశామని ఆపిల్ తెలిపింది. వినియోగదారులు ఆన్లైన్ ఆర్డర్లను తీసుకోవచ్చని పేర్కొంది.