Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఔషధ ఉత్పత్తుల కంపెనీ లీ హెల్త్ కొత్తగా 'యాక్టోకిన్' పేరుతో సహజ పదార్థాలతో న్యూట్రా స్యూటికల్ ట్యాబ్లెట్స్ను తయారు చేసినట్లు వెల్లడించింది. కరోనా వంటి వైరస్ సంబంధ అంటు వ్యాధుల బారినపడ్డ వారిలో కీళ్ల నొప్పులు, చేతులు, అరచేతులు, కాళ్లు, పాదాలలో మంట, తిమ్మిరి, జలదరింపు వంటి నరాల సమస్యలను తగ్గించడానికి ఇది ఉపయోగపడనుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అలసట నుంచి ఉపశమనం పొందడానికి సహాయక చికిత్సగా శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ చర్యతో దీన్ని రూపొందించినట్లు పేర్కొంది. ఇందులోని కొలాజెన్, బోస్వెలియా సెరాటా, కుర్కుమిన్ ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నొప్పి నివారణ మందుల స్థానంలో ఉపయోగించవచ్చని కంపెనీ డైరెక్టర్ ఆళ్ల లీలారాణి తెలిపారు. రెండు మూడు వారాలపాటు ఈ ట్యాబ్లెట్లను వాడితే సరిపోతుందన్నారు. అన్ని మందుల షాపులు, ఆన్లైన్లోనూ, కంపెనీ వెబ్సైట్లో ట్యాబ్లెట్లు లభిస్తాయన్నారు.