Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ), ప్రయివేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు కీలక ఒప్పందం కుదర్చుకున్నాయి. దీంతో 4.7 కోట్లకు పైగా ఐపీపీబీ వినియోగ దారులు ఇప్పుడు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉత్పత్తులు, సేవలు వినియోగించుకోగలుగుతారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. ఐపీపీబీకి ఉన్న 650 శాఖల నెట్వర్కు, 1,36,000 బ్యాంకింగ్ యాక్సెస్ పాయంట్ల ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన పరిధిని చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించుకోనున్నట్టు ఆశాభావం వ్యక్తం చేసింది.