Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో సుప్రసిద్ధ ఆయుర్వేదిక్, నేచురల్ హెల్త్‌కేర్ కంపెనీ డాబర్ ఇండియా లిమిటెడ్ నేడు డాబర్ వీటా ఆవిష్కరణతో తాము హెల్త్ ఫుడ్ డ్రింక్ విభాగంలో ప్రవేశించినట్లు వెల్లడించింది. ఇది 30కు పైగా ఆయుర్వేద వనమూలికలు అయినటువంటి అశ్వ గంధ, గిలోయ్, బ్రహ్మి తదితరాలతో తయారైంది. ఇవి రోగ నిరోధక శక్తిని అత్యుత్తమంగా అందించడంతో పాటుగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సైతం చిన్నారులలో మెరుగుపరుస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. ‘‘నాణ్యత, నమ్మకం, 137 సంవత్సరాల అనుభవమనే డాబర్ వారసత్వంపై ఆధారపడి డాబర్ వీటా రెండు రెట్ల అత్యున్నత ప్రయోజనాలను ఎదుగుదల, రోగ నిరోధక శక్తి పరంగా అందిస్తుంది. అంతేకాదు ఇతర మిల్క్ ఫుడ్ డ్రింక్స్‌తో పోలిస్తే మహోన్నతమైన రుచిని సైతం ఇది అందిస్తుంది. ఈ–కామర్స్‌లో ఇటీవలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే పాల పానీయాలను గురించి వెదకడం చూస్తున్నాము. ఇప్పుడు వృద్ధి చెందుతున్న వినియోగదారుల సమకాలీన అవసరాలను డాబర్ వీటా తీర్చనుంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం చేసుకుని దీనిని ఆవిష్కరించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఆరోగ్య విభాగంలో మా జాబితాను డాబర్ వీటా మరింత విస్తృత పరచనుంది’’ అని డాబర్ ఇండియా లిమిటెడ్ బిజినెస్ హెడ్ ఈ–కామర్స్ స్మెర్త్ ఖన్నా అన్నారు.
‘‘నీల్సన్ ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం, దాదాపు 88% మంది తల్లులు హెల్త్ డ్రింక్‌లలో రోగ నిరోధక శక్తి మెరుగుపరిచే ప్రయోజనాలను గురించి ఎక్కువగా చూస్తున్నారు. మహమ్మారి అనంతర ప్రపంచంలో వినియోగదారుల అవసరాలను గుర్తెరిగి డాబర్ ఇండియా లిమిటెడ్ వద్ద ఈ వినూత్నమైన ఉత్పత్తిని తీర్చిదిద్దాము. మార్కెట్లో ఇతర హెల్త్ డ్రింక్‌లతో పోలిస్తే మెరుగైన రోగ నిరోధక శక్తిని ఇది అందిస్తుంది.ఆయుర్వేద ప్రయోజనాలను రుచికరమైన చాక్లెట్ డ్రింక్‌లో అందిస్తుంది’’ అని ప్రశాంత్ అగర్వాల్, మార్కెటింగ్ హెడ్– హెల్త్ సప్లిమెంట్స్, డాబర్ ఇండియా లిమిటెడ్ అన్నారు. ఈ–కామర్స్‌లో డాబర్ వీటా ఆవిష్కరించడం కోసం ఫ్లిప్‌కార్ట్‌తో డాబర్ ఒప్పందం చేసుకుంది. చాక్లెట్ ఫ్లేవర్‌లో 7 ఎస్కెయుల 15గ్రాముల పౌచ్ 10 రూపాయలకు, 75 గ్రాముల పౌచ్ 30 రూపాయలు, 200 గ్రాముల బిబ్ 120 రూపాయలకు లభిస్తుంది. అయితే ప్రారంభ ధరగా దీనిని 99 రూపాయలకు, 500 గ్రాముల బిబ్ను 235 రూపాయలు, 500గ్రాముల జార్‌ను 249 రూపాయలు, 750 గ్రాముల పౌచ్ 340 రూపాయలు, 1కేజీ బిబ్ను 430 రూపాయలకు అందిస్తున్నారు.
‘‘ఆరు నుంచి 15 సంవత్సరాల చిన్నారుల మెదడు ఆరోగ్యం మెరుగుపరచడంలో ఈ డ్రింక్ తోడ్పడుతుంద’’ని డాబర్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్– మార్కెటింగ్ రాజీవ్ జాన్ అన్నారు.